Tollywood: రాజ‌శేఖ‌ర్‌కు నిజంగానే గోటీల ఫ్యాక్ట‌రీ ఉందా.? ఫ‌స్ట్ టైమ్ స్పందించిన సీనియ‌ర్ హీరో

Published : Mar 14, 2026, 05:19 PM IST

Tollywood: కొన్ని వార్త‌లు ఎలా పుట్టుకొస్తాయో తెలియ‌దు కానీ తెగ వైర‌ల్ అవుతుంటాయి. సోష‌ల్ మీడియా యుగంలో ఇది మ‌రీ ఎక్కువైంది. ఇటీవ‌ల సీనియ‌న్ హీరో రాజ‌శేఖ‌ర్‌కి సంబంధించిన ఇలాంటి వార్తే ఒక‌టి నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. 

PREV
14
గోటీల ఫ్యాక్ట‌రీ పేరుతో ప్ర‌చారం

కొంతకాలంగా ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అందులో రాజశేఖర్ గోటీల వ్యాపారం నిర్వహిస్తున్నారని, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ వంటి దేశాల్లో వాటిని విక్రయిస్తూ భారీ ఆదాయం పొందుతున్నారని పేర్కొన్నారు. అంత‌టితో ఆగ‌కుండా కొంద‌రు గోటీల ఫ్యాక్ట‌రీలో ప‌నిచేస్తున్న‌ట్లు ఐడీ కార్డులు కూడా వైర‌ల్ చేశారు. దీంతో నిజంగానే ఇలాంటిది ఏమైనా ఉండొచ్చ‌ని చాలా మంది అనుకున్నారు కూడా.

24
స్పందించిన రాజ‌శేఖ‌ర్

ఈ వార్తలపై తాజాగా ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజశేఖర్ స్పందించారు. గోటీల ఫ్యాక్టరీ లేదా అలాంటి వ్యాపారం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ వీడియో చూసినప్పుడు తానే ఆశ్చర్యపోయానని చెప్పారు. “నాకు ఫ్యాక్టరీ ఎక్కడుంది? నేను ఎక్కడ నుంచి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాను?” అని చెప్పుకొచ్చారు. ఈ వార్తల వల్ల తనకు తెలిసినవాళ్లు కూడా ఫోన్ చేసి నిజమా అని అడిగారని ఆయన తెలిపారు.

34
ఇమిటేషన్‌లపై కూడా స్పందించిన హీరో

సినిమాల్లో చాలా మంది నటులు రాజశేఖర్‌ను అనుకరిస్తూ కామెడీ సన్నివేశాలు చేయడం తెలిసిందే. దీనిపై కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రారంభంలో ఎవరైనా తనను ఇమిటేట్ చేస్తే ఆశ్చర్యంగా అనిపించేదని చెప్పారు. తర్వాత అది సరదాగా అనిపించిందన్నారు. “రోజ్… రోజ్… రోజా పువ్వా” పాటలో తాను చేసిన డ్యాన్స్ కూడా కొందరు స్టేజ్‌లపై అనుకరిస్తే చూసి నవ్వుకుంటానని చెప్పారు.

44
లేటెస్ట్ ప్రాజెక్ట్

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజశేఖర్ ఒక కొత్త సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నటుడు శ‌ర్వానంద్ హీరోగా తెర‌కెక్కుతోన్న బైకర్ అనే చిత్రంలో ఆయన ముఖ్య‌ పాత్రలో కనిపించనున్నారు.అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories