షానిద్ ఆసిఫ్ అలీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఇలా రాశారు: 'అల్లా దయతో, ఈ రోజు ఉదయం 4:25 గంటలకు మా కుటుంబంలోకి ఒక ఆడబిడ్డ వచ్చింది. ఆమె అల్లా ఇచ్చిన అమూల్యమైన బహుమతి, మా హమ్దు కుట్టీకి ప్రియమైన సోదరి. ఇది మా కుటుంబానికి లభించిన గొప్ప ఆశీర్వాదం. సుఖ ప్రసవం జరిగింది. అల్లాహ్ మా బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించాలి. డాక్టర్ సఫా ఫాతిమా, డెలివరీ రూమ్‌లో మాతో ఉన్న నర్సులు, ఆస్టర్ హాస్పిటల్ సిబ్బందికి మా ధన్యవాదాలు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని పేర్కొన్నారు.