అయితే అన్నదమ్ములు ఇద్దరితో నటించి, ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ పండించిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్ళిద్దరితో అప్పటి హీరోయిన్ సిమ్రన్ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాల్లో బాలయ్యతో నటించిన సిమ్రన్.. సీతయ్య చిత్రంలో హరికృష్ణతో కూడా నటించింది. కాజల్ అగర్వాల్, శృతి హాసన్ ఇద్దరూ మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో నటించారు.