వెంకట్‌, సుశీలమ్మతో దెబ్బలు తిన్న నాగార్జున.. తండ్రి ఏఎన్నార్‌ లేకపోతే నాగార్జున చేసే పనులేంటో తెలుసా?

First Published Nov 1, 2024, 1:56 PM IST

నాగార్జున చిన్నప్పటి వ్యవహారాలు బయటకు వచ్చాయి. ఆ పనులు చేస్తూ అన్న వెంకట్‌, అక్క సుశీలమ్మకి దొరికిపోయేవాడట. వాళ్లు చితక్కొట్టేవాళ్లట. 
 

కింగ్‌ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరుగా ఉన్నారు. ముఖ్యంగా సీనియర్లలో ఆ నలుగురిలో ఒకరుగా రాణిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లకు దీటుగా సినిమాలు చేసి మెప్పించారు. ప్రారంభంలో యాక్షన్‌ సినిమాలు, ఆ తర్వాత లవ్‌ స్టోరీలు, భక్తిరస చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు చేసి మెప్పించారు. అయితే రొమాంటిక్‌ మూవీస్‌ నాగ్‌కి మంచి పేరుని తీసుకొచ్చాయి. `గీతాంజలి`, `నిన్నే ప్రేమిస్తా`, `మన్మథుడు`, `సంతోషం` సినిమాలు నాగ్‌కి ఎంతో గుర్తింపుని రొమాంటిక్‌ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత యాక్షన్స్ చేశారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Nagarjuna Akkineni

అలాగే `అన్నమయ్య`, `శ్రీరామదాసు` చిత్రాలో తన ఇమేజ్‌ని పూర్తిగా మార్చేశాడు. రొమాంటిక్‌ ఇమేజ్‌ ఉన్న నాగ్‌ ఇలాంటి సినిమాలు చేయడమేంటి అని అంతా షాక్‌ అయ్యేలా ఆయన మెప్పించడం విశేషం. సోలోహీరోగానే కాదు, పలు మల్టీస్టారర్‌ చిత్రాలు కూడా చేసి మెప్పించాడు నాగ్‌. ఇప్పుడు కూడా ఆ ట్రెండ్‌ని కంటిన్యూ చేస్తున్నాడు.

ప్రస్తుతం రజనీకాంత్‌, ధనుష్‌లతో కలిసి నటిస్తున్నారు. అయితే ఏఎన్నార్‌ ఫ్యామిలీలో నాగ్‌ ఒక్కడే హీరోగా నిలబడ్డాడు. అక్కినేనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లున్నారు. వీరిలో నాగార్జున చిన్నవారు. అన్న వెంకట్‌ సినిమాలు చేయలేదు. నిర్మాతగా కొన్నిసినిమాలు నిర్మించారు. కానీ అవి కూడా వదిలేశాడు.

ఇక అక్క సుశీలమ్మ సైతం ప్రొడక్షన్ లో ఇన్‌వాల్వ్ అయ్యింది, సక్సెస్‌ కాలేదు. మిగిలిన అక్కలు సినిమాలకు దూరంగానే ఉన్నారు. నాగ్‌ మాత్రమే అటు హీరోగా, నిర్మాతగా, బిజినెస్‌ మేన్‌గా సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు ఆయన వారసులు నాగచైతన్య, అఖిల్‌ కూడా హీరోగాలుగా రాణిస్తున్నారు. 
 

Latest Videos


Nagarjuna Akkineni

ఇదిలా ఉంటే నాగార్జున బాల్యం ఎలా సాగింది, ఆయన ఎలా ఉండేవారనేద పెద్దగా సమాచారం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. చిన్నప్పుడు తాను ఎలా ఉండేవాడో తెలిపారు. స్కూలింగ్‌ అంతా చెన్నైలో జరిగింది. అప్పుడు అందరిలో కెళ్ల తనే చిన్నవాడిగా ఉండేవాడట.

దీంతో చాలా మంది ఆటపట్టించేవారట. ఏడిపించేవారని తెలిపారు. మరోవైపు  స్కూలింగ్‌ హైదరాబాద్‌ పబ్లిక్ స్కూల్‌లోనే సాగింది. ఇంజనీరింగ్‌ వరకు ఇక్కడే చదువుకున్నాడు. అయితే ఇక్కడ సరిగా మార్కులు రావడం లేదని చెప్పి, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ కోసం యూఎస్‌ వెళ్లాడట. ఆ తర్వాత నటుడిగా టర్న్ తీసుకున్నట్టు తెలిపారు. 
 

ఇదిలా ఉంటే తాను చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడట. స్కూల్‌లోనూ చాలా అల్లరి చేసేవాడిని అని, చాలా కంప్లెయింట్స్ ఉండేవని తెలిపారు. ఇప్పటిలా సోషల్‌ మీడియా లేకపోవడంతో తమ ప్రైవసీకి ఇబ్బంది లేదని, తాను ఎవరో ఎవరికీ తెలిసేది కాదని, దీంతో ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని అని, అల్లరి పనులన్నీ చేసినట్టు తెలిపారు.

ఏది ఇంట్లో తెలిసేది కాదన్నారు. అంతేకాదు తన ఇంట్లోనే అంతే అని, నాన్న, అమ్మ ఉన్నంత సేపు చాలా సైలెంట్‌గా, రాముడు మంచి బాలుడు అనేలా ఉండేవాడిని అని, వాళ్లు వెళ్లిపోయాక తన విశ్వరూపం చూపించేవాడట. అయితే ఇంట్లో అన్న, అక్క వెంకట్, సుశీల తనని వాళ్ల పనుల కోసం బాగా వాడుకునేవారట. చేయకపోతే కొట్టేవాళ్లట.

మాటలతో చెప్పడం ఉండేది కాదని, నో చెబితే దెబ్బలే పడేవని తెలిపారు నాగ్‌. అయితే నాన్న వచ్చాక ఇలా కొట్టినట్టు వాళ్ల మీద కంప్లెయింట్‌ కూడా ఇచ్చేవాడట. దీంతో నాన్న వాళ్లని తిట్టేవాడట. 
 

అయితే వాళ్లు వెళ్లిపోయాక, అమ్మా, నాన్నలతో తనకు డబుల్‌ కోటింగ్‌ ఉండేదని, ఇదేదో తనకే ముప్పుగా మారుతుందని చెప్పి కొన్నాళ్ల తర్వాత కంప్లెయింట్‌ ఇవ్వడమే మానేశా అని చెప్పారు నాగార్జున. దాన్ని అన్న, అక్క క్యాష్‌ చేసుకుని తనని బాగా ఆడుకునేవాళ్లని తెలిపారు నాగ్‌.

యాంకర్‌ ప్రదీప్‌తో చేసిన `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` షోలో ఈ విషయాన్ని తెలిపారు నాగ్‌. ఈ సంక్రాంతికి `నా సామి రంగ` సినిమాతో హిట్‌ కొట్టి నాగ్‌ ఇప్పుడు రజనీకాంత్‌తో `కూలీ` సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అలాగే ధనుష్‌తో `కుబేర` మూవీలో రిచ్‌ పర్సన్‌గా కనిపించబోతున్నారు. 

Read more: వెంకటేష్‌ సినిమా టైటిలే `సంక్రాంతికి వస్తున్నాం`.. పిచ్చి పీక్‌లోకి వెళితే ఇలానే ఉంటుందేమో!

also read:  స్టార్‌ హీరోయిన్‌తో రాజేంద్రప్రసాద్‌కి ఉత్తమ జంటగా సత్కారం.. ఇంటికెళ్లాక నటకిరీటి భార్య ఏం చేసిందో తెలుసా?

click me!