అనంతరం ప్రభాస్ చేసిన ఛత్రపతి, యోగి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలు టాప్ హీరోల్లో ఒకరిగా నిలబెట్టాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేశాయి. 2015లో విడుదలైన బాహుబలి పాన్ ఇండియా హిట్. దానికి కొనసాగింపుగా 2017లో బాహుబలి 2 విడుదలైంది. ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇండియా పరిథిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి 2 ఉంది. ఆ రికార్డు బ్రేక్ కాలేదు.
ప్రభాస్ ఇమేజ్ రాజమౌళి పుణ్యమే అనే వారికి తన తదుపరి చిత్రాలతో ప్రభాస్ సమాధానం చెప్పాడు. సాహో తెలుగులో ప్లాప్ కానీ హిందీ లో హిట్ అయ్యింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశ పరిచినప్పటికీ సలార్, కల్కి చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి. కల్కి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.