Sankranthi 2023 : సంక్రాంతికి సినీ తారల గ్లామర్ మెరుపులు.. రష్మిక, అనుపమా, మాళవికా ఫెస్టివల్ ట్రీట్!

Published : Jan 15, 2023, 08:43 PM IST

2023 సంక్రాంతి వేడుకలను సినీ తారలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తూ.. తమ అభిమానులకు విషెస్ తెలిపారు.  మరోవైపు గ్లామర్ ట్రీట్ తోనూ ఆకట్టుకున్నారు.   

PREV
16
Sankranthi 2023 : సంక్రాంతికి సినీ తారల గ్లామర్ మెరుపులు..  రష్మిక, అనుపమా, మాళవికా ఫెస్టివల్ ట్రీట్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)కు ఈ సంక్రాంతి ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పాలి. తను ఎంతగానో అభిమానించే తమిళ స్టార్ విజయ్ సరసన ‘వారసుడు’లో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తోంది.
 

26

ఈ సందర్భంగా తాజాగా రష్మిక మందన్న తన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. అయితే.. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ కావడంతో దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దీంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ,  ఇంగ్లీష్ భాషల్లో స్టార్ హీరోయిన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా రెడ్ చుడీదార్ లో ‘నమస్కారం’ పోసులో స్టిల్ ఇచ్చిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. 

36

కేరళ కుట్టి, యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) పండుగ వేళ ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది. లెహంగా, వోణీలో కుర్రాళ్లను  ఆకట్టుకుంటుంది. తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. 

46

ఈ సందర్భంగా అనుపమా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న ఈ మలబార్ అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీకి కూడా ఫ్యాన్స్ విషెస్ చెబుతూ.. తన కేరీర్ మరింత దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. 

56

యంగ్ హీరోయిన్ మాళవికా శర్మ (Malvika Sharma) హాఫ్ శారీలో ఆకట్టుకుంటోంది. సంక్రాంతి పండుగ వేళ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా అదిరిపోయే పోజులిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

66

‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah సంక్రాంతికి గ్లామర్ ట్రీట్ అందించింది. వైట్ డ్రెస్ లో టాప్ టు బాటమ్ పరువాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ గుండెల్ని కొల్లగొట్టింది. పొడగరి సొగసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మడు ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 


 

click me!

Recommended Stories