Samyuktha Menon : ‘నా జీవితమంతా సాహసమే’... ఆసక్తికరంగా సంయుక్త మీనన్ వ్యాఖ్యలు!

First Published | Feb 11, 2024, 5:01 PM IST

క్రేజీ హీరోయిన్ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) ప్రస్తుతం నిఖిల్ సరసన నటిస్తోంది. వరుసగా హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ నెక్ట్స్ సినిమా కోసం మరింతగా శ్రమిస్తోంది. 

కేరళ కుట్టి సంయుక్తా మీనన్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా ఘన విజయాలు సాధిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది.

బింబిసార, సార్, విరూపాక్ష, డెవిల్ సినిమాలతో టాలీవుడ్ లో తన సక్సెస్ ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆమె క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) సరసన ‘స్వయంభు’ (Swayambhu)లో హీరోయిన్ గా నటిస్తోంది. 


ఈ సినిమా కోసం ఇప్పటికే నిఖిల్ కండలు పెంచడంతో పాటు యుద్ధ సన్నిశేశాలపై వియాత్నంలో శిక్షణ పొందారు. ఇప్పుడు సంయుక్తా మీనన్ సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటోంది. హార్స్ రైడింగ్ చేస్తున్న ఫొటోలను ఫొటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. 

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ ఆసక్తికరంగానూ స్పందించింది... ఈ ఏడాది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితం అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. నా జీవితమంతా సాహసాలతోనే సాగుతోంది. కంఫర్ట్ గా ఒకే చోట ఉండిపోవడాన్ని ఇష్టపడను. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడుగులు వేస్తుంటా. 

నా కొత్త సినిమా ‘స్వయంభు’ కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నా. హార్స్ రైడింగ్ నేర్చుకోవడం కొత్త మానసిక అనుభూతిని కలిగిలిస్తోంది. అపజయాలనే విజయాలకు మెట్లుగా మార్చుకుంటున్నా... అని పేర్కొంది.  
 

ఈ భారీ మైథలాజికల్ యాక్షన్ ఫిల్మ్ కు భరత్ క్రిష్ణమాచారారి దర్శకుడు. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు హీరోహీరోయిన్ ను డైరెక్టర్ బాగానే కష్టపెడుతున్నారు. సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి భువన్, శ్రీకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

Latest Videos

click me!