Shwetha Menon : ‘బికినీలోనే కాదు.. అవసరమైతే న్యూడ్ గానూ’.. దేనికైనా రెడీ అంటున్న ‘రతి నిర్వేదం’ హీరోయిన్!

First Published | Feb 11, 2024, 4:06 PM IST

మలయాళం నటి శ్వేత మీనన్ (Swetha Menon) కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి. ‘రతి నిర్వేదం’ హీరోయిన్ ఇచ్చిన ఆన్సర్ కు అందరి మతులు పోతున్నాయి.
 

మలయాళం నటి శ్వేతా మీనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. మలయాళం చిత్రాలతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లోనూ నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన ఒక చిత్రం మాత్రం అన్నీ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 

2011లో  వచ్చిన శ్రుంగార చిత్రం  ‘రతి నిర్వేదం’తో  బ్లాక్ బాస్టర్ హిట్ ను  అందుకుంది. ఆ సినిమాతో తెలుగులోనూ ఈ బ్యూటీ బాగా పాపులర్ అయ్యింది. మలయాళం నుంచి వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ లనూ ట్రెండ్ సెట్ చేసింది. ముఖ్యంగా శ్వేతా మీనన్ కు మంచి గుర్తింపు వచ్చింది. 


టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంతో  శ్రీజిత్ విజయ్, శ్వేతా మీనన్ జంటగా నటించారు.  ఇప్పటికీ ఈ చిత్రంలోని హాట్ సీన్లు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. పదమూడేళ్లు దాటినా ఈ చిత్రం ఇంక కట్టిపడేస్తుందంటే  అప్పుడు ఏ రేంజ్ లో ఆడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన శ్వేతా మీనన్ కు మంచి క్రేజ్ పెరిగింది. దీంతో అటు బాలీవుడ్ లోనూ వరుసగా ఆఫర్లు దక్కాయి. అక్కడా మంచి గుర్తింపు తెచ్చకుంది. ఇక సోషల్ మీడియాలోనూ తరచుగా ఈ ముద్దుగుమ్మ కనిపిస్తూనే ఉంటుంది. 
 

ఇక తనకు ఎదురైన కొన్ని ప్రశ్నలకు తాజాగా బదులిచ్చినట్టు తెలుస్తోంది. ‘రతి నిర్వేదం’ లాంటి పాత్రల్లో మళ్లీ నటిస్తారనే అనే ప్రశ్నకు షాకింగ్ గా బదులిచ్చింది... ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దిమ్మతిరిగే ఆన్సర్ కు అంతా షాక్ అవుతున్నారు. 
 

‘సినిమాకు ఓకే చెప్పే ముందే ఏ పాత్రలో నటిస్తున్నానన్నది తెలుసుకుంటాను. సినిమాకు అవసరం అయితే.. బికినీలో నటించాల్సి వచ్చినా నటిస్తా.... కథకు అవసరమైతే నగ్నంగా నటించడానికికైనా సిద్ధమే’ అంటూ చెప్పుకొచ్చింది.’ దీంతో తన నుంచి రాబోయే చిత్రాలపై ఆసక్తి నెలకొంది. 

Latest Videos

click me!