దిగొచ్చిన కమెడియన్ సునిల్, రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నాడంటే..?

First Published | Feb 11, 2024, 4:29 PM IST

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగాడు సునిల్.. హీరోగా ఎంట్రీ ఇచ్చి..కెరీర్ లో ఎన్నో కుదుపులు చూశాడు. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్.. ఇప్పుడు తమిళంలో బిజీ అయ్యాడు. భారీగా డిమాండ్ చేస్తున్నాడట కూడా. 

టాలీవుడ్ లో ఎంతో కష్టపడి కమెడియన్ గా ఎదిగాడు సునిల్. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తో పాటు మ్యానరిజం కూడా  ఆడియన్స్ కు అలవాటు చేశాడు సునిల్. బ్రహ్మానందం లాంటి స్టార్ సీనియర్ కమెడియన్స్ కు కూడా పోటీ ఇచ్చిన సునిల్.. కెరీర పీక్స్ లో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ను డిస్ట్రబ్ చేసుకున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. 
 

ఇక మళ్ళీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునిల్. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాడు. కాని తెలుగు కంటే.. తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు సునిల్. తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అక్కడ కూడా కమెడియన్ గా.. విలన్ గా వరుస అవకాశాలు ఆయన గుమ్మం మందుకు వచ్చి పిలుస్తున్నాయి. 


Sunil , Jailer

తెలుగులో అడపా దడపా సినిమాల్లో నటించినా మునుపటి జోష్ లో అయితే పాత్రలు రావడం లేదు.ఇలాంటి టైమ్ లో సునీల్ కి కోలీవుడ్ నుంచి మంచి ఛాన్స్ లభించింది. తమిళంలో సునీల్ నటించిన జైలర్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అంతకు ముందు శివకార్తికేయన్ మహావీరన్ సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించాడు సునిల్. తాజాగా జైలర్ సినిమాతో కోలీవుడ్ లో కూడా స్టార్ గా మారాడు. 
 

జైలర్ లో సునిల్ పాత్ర తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చింది. దీంతో తమిళంలో సునీల్ కి మంచి ఆఫర్లు వస్తున్నాయి.ఇక లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ లో కూడా సునీల్ నటించాడు. ఇక హీరోగా నటించిన టైమ్ లో తన రెమ్యూనరేషన్ భారీగా పెంచాడట సునిల్. ముఖ్యంగా మర్యదరామన్న సూపర్ హిట్ తో సినిమాకు 3 నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేశాడట అప్పట్లో. ఆటైమ్ లో అది చాలా పెద్ద డిమాండే అనుకోవాలి. 
 

కాని ఇప్పుడు ఈ విషయంలో సునిల్ దిగిరాక తప్పలేదు. తెలుగులో అయితే సునిల్ కు అవకాశాలు తక్కువ.. చేసే సినిమాకు కూడా రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నారని టాక్. టాలీవుడ్ లో సినిమాలకు 40 లక్షల వరకూ ఇస్తున్నారట మేకర్స్. అది కూడా రోల్ ను బట్టి ఇస్తున్నారట. ఇక తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు సునిల్ అక్కాడ మాత్రం డిమాండ్ పెరుగుతండటంతో.. సినిమాకు 60 నుంచి 80 లక్షల వరకూ వసూలు చేస్తున్నాడటి టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

ఇక  సునిల్ కు తమిళంలో  డిమాండ్ పెరగంలో.. అక్కడ స్టార్ గా మారి.. చెన్నైలోనే  సెటిల్ అయినా అవుతాడేమో అని అంటున్నారు ఫ్యాన్స్. మరి సునిల్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నాడు. చూడాలి ఆయన నెక్ట్స్ కెరీర్ అంతా తమిళ సినిమాలకే ఇస్తాడా..? లేక తెలుగుసినిమాలు కూడా ఎక్కువగా చేస్తాడా అని. 
 

Latest Videos

click me!