Betting Apps: అన్వేష్‌ ఏమైనా మంచోడా.? బెట్టింగ్‌ యాప్స్‌కి అతనే కారణం. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ అంశం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. బడా స్టార్‌లు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు పోలీసుల విచారణ సైతం ఎదుర్కొన్నారు. అయితే తొలి నుంచి ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌ బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతోన్న విషయం తెలిసిందే..
 

Anvesh Madhavi latha

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ.. అన్వేష్‌ ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోషన్‌ చేస్తున్న వారిపై చిన్న సైజ్‌ యుద్ధం చేస్తున్న అన్వేష్‌ నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటున్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయర్స్‌ మొదలు పలువురు సినీతారలపై అటాక్‌ చేస్తూ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నాడు. ఈ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తున్నాడు. 

Anvesh-vs-Ali

మొన్నటికి మొన్న నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కమెడియన్‌ అలీ గురించి కూడా ఒక వీడియో చేశాడు. వేల కోట్ల ఆస్తులున్న అలీ బెట్టింగ్‌ యాప్స్‌ను ఎలా ప్రమోట్‌ చేస్తారంటూ ఓ రేంజ్‌లో విమర్శించాడు. అంతటితో ఆగకుండా రూ. 10 వేలతో బిర్యానీ వండి బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి రూ. 20 లక్షలు నొక్కేశాడు అంటూ అన్వేష్‌ విమర్శించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇదిలా ఉంటే అందరిపై అటాక్‌ చేస్తున్న అన్వేష్‌ను టార్గెట్‌ చేసింది టాలీవుడ్‌ హీరోయిన మాధవి లత. బెట్టింగ్‌ యాప్స్‌కు యువత అట్రాక్ట్‌ కావడానికి అసలు కారణం అన్వేష్‌ అంటూ సరికొత్త లాజిక్‌ చెప్పుకొచ్చారు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందించే మాధవి లత అన్వేష్‌ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి అమ్మయిలతో గడపొచ్చని చెబుతుంటాడు. విదేశాలకు వస్తే ఎంజాయ్ చేయొచ్చని చెబుతుంటాడు' అని చెప్పుకొచ్చారు. 

ఇతని మాటలు విన్న వారు ఏం నేర్చుకుంటారు. ఇది ఎలా కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్నుకచ్చితంగా తిడుతారు. అయినా నాకేం సమస్య లేదు. అన్వేష్‌ చేసే వీడియోలను చూసిన వారు.. విదేశాలకు వెళ్తే ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటారు. ఇందుకు ఈజీ మనీ కోసం వెంపర్లాడుతారు. ఈజీగా బెట్టింగ్ యాప్స్ వాడి డబ్బులు సంపాదించ వచ్చు, మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. ఇతర దేశాల్లో అమ్మాయిలతో గడపొచ్చు అని ఆలోచిస్తారు. ఇలా బెట్టింగ్ యాప్స్‌కు అలవాటు పడి ఉన్నదంతా కోల్పోతారు అంటూ మాధవిలత చెప్పుకొచ్చారు. దీంతో మాధవి లత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు మాధవిలతకు మద్ధతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. 

Latest Videos

click me!