Keerthy Suresh Remuneration : కీర్తి సురేష్ షాకింగ్ రెమ్యునరేషన్.. బాలీవుడ్ లో తొలి సినిమాకు అంత తీసుకుంటుందా?

Published : Mar 05, 2024, 02:54 PM ISTUpdated : Mar 05, 2024, 03:06 PM IST

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలో బాలీవుడ్ (Bollywood)లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్బంగా అక్కడ తన తొలి సినిమాకు ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గ్గా మారింది. 

PREV
16
Keerthy Suresh Remuneration : కీర్తి సురేష్ షాకింగ్ రెమ్యునరేషన్.. బాలీవుడ్ లో తొలి సినిమాకు అంత తీసుకుంటుందా?

‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. తన నటనతో ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. అప్పటి నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 
 

26

టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ (Kollywood) లో కీర్తి సురేష్ కు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇటీవల సరికొత్తగా ఆడియెన్స్ ను అలరిస్తోంది. 
 

36

చివరిగా తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సరసన ‘సర్కారు వారి పాట’లో నటించింది. ఈ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ‘భోళా శంకర్’ కీలక పాత్రలో మెరిసింది. 
 

46

ఇక ప్రస్తుతం మహానటి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తేరీ రీమేక్ తో వస్తున్న ‘బేబీ జాన్’ (Baby John Movie)తో హిందీలో అడుగుపెట్టబోతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 

56

అయితే కీర్తి సురేష్ ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. బేబీ జాన్ కోసం రూ.4 కోట్లు తీసుకుంటుందని సమాచారం. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.2 కోట్లు మాత్రమే తీసుకునే కీర్తి తన పారితోషికాన్ని డబుల్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
 

66

‘బేబీ జాన్’లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. అట్లీ నిర్మాతగా వహిస్తున్నారు. కలీస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక కీర్తి కోలీవుడ్ లో ‘రఘుతాత’, ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివెడి’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

click me!

Recommended Stories