తమన్నాకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా...?

First Published | Mar 5, 2024, 1:13 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకుకోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా..? ఎవరి మీద చూస్తుంది అని మీరు అనుకుంటున్నారు. ఆమె ఏం చేస్తుందో తెలస్తే  నిజంగా ఆశ్చర్యపోతారు. 

టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది తమన్నా..సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దుమ్ము పేరు సంపాదించుకుంది తమన్నా. ఈమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో ఈమెకు తిరుగులేకుండా పోయింది. అయితే ఈ మధ్య తెలుగులో ఈ అమ్మడు కాస్త సినిమాలు తగ్గించింది.
 

 తెలుగుతో పాటు.. తమన్నా తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్ లతో హడావిడి చేస్తోంది. అయితే తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు లేవు అమ్మడికి. తమిళంలో అడపా దడపా సినిమాలు చేస్తూ ఉంది అంతే.. ఇక ముంబయ్ లో తన ప్రియుడు  విజయ్ వర్మతో కలిసి సందడి చేస్తోంది. 


అయితే సినిమాలు పెద్దగా రాకపోవడంతో..  తమన్నా వెబ్ సిరీస్ లపై పడింది. ఎక్కువగా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది. ఎంత హాట్ అయినా సరే చేయడానికి సై అంటోంది తమన్నా. ఇలా రకరకాలుగా స్క్రీన్ మీద  ఫుల్ బిజీ అయిపోయింది. ఖాళీగా ఉండటంలేదు తమన్నా...? 

Vijay Varma with Tamannaah

ఇక మిల్క్ బ్యూటీ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగి తేలుతోంది. ఈ విషయం అందరికి  తెలిసిందే. వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని.. వారి ప్రేమ విషయం బయట తెలియడంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సందడి చేస్తున్నారు. 

Tamannaah Bhatia

ఇద్దరు రెస్టారెంట్లు తిరగడం.. రొమాంటిక్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో శేర్ చేస్తూ.. హడావిడి చేస్తున్నారు. ఇద్దరు చేట్టా పట్టా లేసుకొని తిరుగుతుంటారు. వీరిద్దరు కలిసి బయటకనిపించడంతో వీరి మీద రూమర్స్ ఎక్కువ వచ్చాయి. అయితే మిల్క్ బ్యూటీగా చాలాసాఫ్ట్ గా ఉండే తమన్నా.. చాలా కూల్ గా ఉంటుంది అనుకుంటారు.

అయితే కొత్తగా తెలిసిన విషయంఏంటంటే..  తమన్నాకు కోపం బాగా  ఎక్కువేనట. కానీ తమన్నాకు కోపం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఇక మీడియా మీద, ఇతరుల మీద ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. కాని తమన్నతో ట్రావెల్ చేస్తున్నవారికి ఆమె కోపం గురించి ఎక్కువగా తెలుస్తుంది. ఆమె వారి మీద ఎక్కువగా చూపిస్తుందట. 
 

ఇతరుల మీద కోపం పెద్దగా రాదు కాని..  తమన్నా.. తన దగ్గర ఉన్న వారి మీద కోపం వస్తే మాత్రం కంట్రోల్ చేసుకోదట.  చుట్టుపక్కల వారు భయపడేతగా ఆమె కోప్పడుతుందట. ఇతరులు ఎవరిపైన అయినా కోపం వస్తే.. వచ్చినవారిమీద అరుస్తారు.. కాని తమన్నా మాత్రం అలా చేయదట. ఈమెకు కోపం వస్తే తన గదికి వెళ్లి డోర్స్ వేసుకొని ఒంటరిగా కూర్చుంటుందట.

 ఎవరు ఎంత పిలిచిన పలకదట. తన కోపం చల్లారిన తర్వాత చట్ట నీటితో షవర్ చేసి బయటకు వస్తుందట. ఆ తర్వాత తన సమస్య ఏంటి? తాను ఎందుకు అలా ఉందనే విషయాలను వారితో షేర్ చేసుకుంటుందట. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Latest Videos

click me!