టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ (Ilieana) కొన్నాళ్లుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చివరిగా ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంతో అలరించింది. ఆ తర్వాత పెద్దగా మూవీ అప్డేట్స్ లేవు.
కానీ తన వ్యక్తిగత విషయాలతో ఇలియానా ఎప్పుడూ నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారింది. ముఖ్యంగా తను పెళ్లి చేసుకోకుండా గర్భం దాల్చడం అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఎట్టకేళకు గతేడాది పండంటి కొడుకు కూడా జన్మనిచ్చింది.
కొద్దిరోజులుగా కొడుకును అల్లారుముద్దుగా పెంచుతూ నెట్టింట సందడి చేసింది. తన ముద్దుల కుమారుడితో అభిమానులకు దర్శనమిచ్చింది. తను ఎంతో సంతోషంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది. వరుస పోస్టులతో ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది.
కానీ తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది ఇలియాన. డెలివరీ తర్వాత తను ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చింది. డిప్రెషన్ తో పాటు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నానని తెలిపింది. దాని నుంచి బయటపడేందుకు కూడా ప్రయత్నిస్తోందంట.
ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు కూడా ఇలియానకు ఎంతగానో సహకరిస్తున్నారని తెలిపింది. తిరిగి ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తానని చెప్పుకొచ్చింది. ఇక కొడుకును తనే దగ్గరుండి చూసుకుంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండలేకపోయినట్టు వివరించింది.
కొడుకు ఫోనిక్స్ తన జీవితంలోకి రావడం గొప్ప విషయమని చెప్పింది. ప్రస్తుతం కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఇలియానా మైఖేల్ డోలాన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది.