ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప చిత్రానికి జపాన్ దేశానికి కనెక్షన్ ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణా ఆ దేశానికి కూడా వెళుతున్నట్లు సుకుమార్ పుష్పలో ప్రస్తావించారు. ప్రస్తుతం రష్మిక జపాన్ దేశంలోనే ఉంది. అయితే పుష్ప మూవీ కోసం కాదు. అనిమే అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు రష్మిక జపాన్ వెళ్ళింది. అక్కడ రష్మిక అందాలు ఆరబోత మామూలుగా లేదు. ఓపెన్ షోల్డర్స్డిజైనర్ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది. జపాన్ దేశంలో స్వచ్ఛత, పరిశుభ్రత, అక్కడ ప్రజలు రష్మికకి ఎంతగానో నచ్చేశాయి ఇకపై ప్రతి ఏడాది జపాన్ తప్పకుండా వెళతా అని రష్మిక మాట ఇచ్చేసింది. రష్మిక ఫొటోస్ వైరల్ గా మారాయి.