
వరుణ్ తేజ్.. ప్రస్తుతం `ఆపరేషన్ వాలెంటైన్` చిత్రంతో వచ్చాడు. పుల్వామా ఉగ్రదాడి ఘటన ఆధారంగా రూపొందిన చిత్రమిది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాజీ మిస్ ఇండియా మనుషి చిల్లర్ హీరోయిన్‌గా నటించడం విశేషం. ఉగ్రదాడి నేపథ్యంలో రియలిస్టిక్ అంశాలతో రూపొందిన ఈ మూవీలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అర్జున్ పాత్రలో నటించాడు. సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. లుక్ వైజ్‌గా, మేకోవర్ వైజ్‌గా చాలానే కష్టపడినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది.
సినిమా పరంగా తన బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాడు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. సినిమాకి ఫస్ట్ డే నుంచి నెగటివ్ టాక్ ప్రారంభమైంది. ఆ మధ్య ఇలాంటి కంటెంట్‌తోనే `ఫైటర్` చిత్రం చేశాడు హృతిక్‌రోషన్. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. పైగా తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ చిత్రం రాలేదు. ఇవి మన ఆడియెన్స్ కి ఎక్కడం కష్టం. సరిగ్గా `ఆపరేషన్ వాలెంటైన్` రిజల్ట్ విషయంలో అదే జరిగింది. ఈ మూవీని కనీసం చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపకపోవడం గమనార్హం.
పుల్వామా ఉగ్రదాడి ఎంతో మందిని ప్రభావితం చేసింది. ఉగ్రవాదులపై ఊగిపోయేలా చేసింది. దీనికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అది మరింత ఒళ్లుగగుర్పొడిచేలా చేసింది. దేశభక్తిని రగిల్చింది. అలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. దేశభక్తి, ఉగ్రదాడుల ను సినిమాగా చేసి కమర్షియలైజ్ చేసే ప్రయత్నం బెడిసికొట్టింది. జనం తిప్పికొట్టారనేదానికి ఈ మూవీ నిదర్శనంగా నిలుస్తుంది. దేశభక్తిని సరైన విధంగా వాడితే ఒకలా, లేదంటే ఫలితాలు మరోలా ఉంటాయని నిరూపించింది.
ఇక శుక్రవారం విడుదలైన `ఆపరేషన్ వాలెంటైన్` మూవీ కలెక్షన్లు చూస్తే మతిపోవాల్సిందే. వరుణ్ తేజ్ టాలీవుడ్‌లో ఎస్టాబ్లిష్ అయిన హీరో. పైగా మెగా ఫ్యామిలీ హీరో. అలాంటిది ఆయన్నుంచి సినిమా అంటే మినిమమ్ ఓపెనింగ్స్ ఉండాలి. కానీ ఈ మూవీకి మాత్రం రివర్స్ అయ్యింది. కనీసం పట్టించుకునే వాళ్లు లేదు. ఏమాత్రం ప్రభావితం చూపించలేకపోయింది. కొత్త హీరోల సినిమాలకు కూడా దీనికంటే బెటర్ కలెక్షన్లు వస్తున్న ఈ రోజుల్లో, వరుణ్ తేజ్ లాంటి హీరోకి దారుణమైన కలెక్షన్లు నమోదవుతున్నాయి.
మొదటి రోజు `ఆపరేషన్‌వాలెంటైన్` కేవలం రెండున్నరకోట్లు మాత్రమే గ్రాస్ చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గ్రాస్. కోటీ నాలభై లక్షల షేర్ రాగా, రెండు రోజు మరింత తగ్గింది. కేవలం రెండు కోట్ల గ్రాస్ వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలో 1.5కోట్ల గ్రాస్, ఇండియా మొత్తం 15లక్షలు, ఓవర్సీస్‌లో 35లక్షలు వచ్చాయి. రెండు కోట్ల గ్రాస్, కోటీ షేర్ వచ్చింది. ఇలా రెండు రోజుల్లో రెండున్నర కోట్ల షేర్ వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 17కోట్లకుపైగానే అయ్యిందట. ఈ వీకెండ్‌లో ఇది మూడున్నర కోట్లు చేస్తే ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే ఈ మూవీ అంతో ఇంతో ఆడుతుంది.
సోమవారం నుంచి పూర్తిగా వాష్ ఔట్ అవుతుందని క్రిటిక్స్ అభిప్రాయపడుతుంది. ఇది వరుణ్ తేజ్‌కి తీరని అవమానం అనే చెప్పాలి. ఆయన నటించిన గత చిత్రాలు `గని`, `గాంఢీవదారి అర్జున` చిత్రాలు దీనికంటే బెటర్‌గానే చేశాయి. కానీ వరుణ్ తేజ్ గ్రాఫ్ ఇలా పడిపోవడం ఆయన కెరీర్‌కే ప్రమాదకరంగా మారుతుంది. నిజానికి `ఆపరేషన్ వాలెంటైన్` మూవీలోనూ మ్యాటర్ లేదు. ఎమోషన్స్ పండలేదు, డ్రామా అసలే లేదు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు స్కోపే లేదు. జస్ట్ వీడియో గేమ్‌ని తలపిస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. వరుణ్ తేజ్ పాత్రకి అసలు ప్రయారిటీనే లేదు. హీరోయిన్ ముందు తేలిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన అసలు ఈ మూవీ ఎందుకు చేశాడో అనే సందేహం కలుగుతుంది.
దీనికితోడు ప్రస్తుతం పరీక్షల సమయం. అది సినిమాపై చాలా ప్రభావం పడిందని అంటున్నారు. ఏదేమైనా బ్యాక్ టూ బ్యాక్ మూడు ఫ్లాప్‌లతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ చవిచూశాడు వరుణ్. వరుణ్ తేజ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె సెంటిమెంట్ కూడా ఆయనకు కలిసి రాలేదు. మ్యారేజ్ అయ్యాక అదృష్టం కలిసి వస్తుందంటుంటారు. కానీ వరుణ్‌కి ఆ ఫ్యాక్టర్ కూడా పనిచేయలేదని స్పష్టమవుతుంది. ఇకపై అయినా ఆయన జాగ్రత్తగా స్క్రిప్ట్ లు ఎంపికచేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.