ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఇతర నటీనటులు ఉన్నారు. అందరు కోట్లలో సంపాధిస్తుంటారు. కాని కొంత మంది మాత్రం ఎంత సంపాధించినా.. ఆరోగ్యం, మనశ్శాంతి లేక ఇబ్బందులకు లోనవుతుంటారు. ఆరోగ్యం పాడైపోయి ఏం చేయాలో తెలియనిపరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారు. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.
అలాంటి హీరోయిన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.. ఇంతకీ ఆమె ఎవరో కాదు..ఆండ్రియా జెరెమియా. సింగర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత నటిగా మారింది ఆండ్రియా. పాటలు పాడుతూనే.. నటిగా తన ప్రస్థానం కొనసాగించింది. తమిళ పరిశ్రమకు చెందిని ఈ నటి.. తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.
మల్టీ టాలెంట్ అని నిరూపించరకున్న ఆండ్రియా కొన్ని వివాదాల్లో కూడా ఫేమస్ అయ్యింది. పలు ఆరోపణలతో పాపులర్ అయ్యింది. తెలుగులో నాగచైతన్య తఢాక సినిమాతో పాటు విక్టరీ వెంకటేష్ సైంధవ సినిమాలో కూడా నటించింది బ్యూటి. తాజాగా తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆండ్రియా.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆండ్రియా.. అనేక విషయాలను పంచుకుంది. వడ చెన్నై సినిమా తర్వాత తనకు ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని.. ఈ వ్యాధి రావడంతో కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారడం జరిగిందని ఆమె బాధపడ్డారు.
అంత కాదు ప్రతిరోజూ నిద్ర లేవగానే శరీరంపై ఎన్నో మచ్చలు కనిపిస్తాయని రక్త పరీక్షలో అసలు ఈ వ్యాధి ఉన్నట్టు కూడా గుర్తించలేకపోయామన్నారు. మానసిక వత్తడి కారణంగా తనకు ఈపరిస్థితి వచ్చిందన్నారు. ఒత్తిడి వలనే తాను ఇలా అయిపోయాన్నారు ఆడ్రియా.
Also Read:
66
Andrea Jeremiah latest glamour photos
అనారోగ్యంతో బాధపడటం వల్లే తాను సినిమాలకు దూరంగా ఉన్నానని.. కానీ తాను బ్రేక్ తీసుకోవడంతో తనకు లవ్ బ్రేకప్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లానంటూ వార్తలు వచ్చాయని అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆమె తెలిపింది.
ఈ వ్యాధికి సంబంధించిన మచ్చలు ఇప్పటికీ శరీరంపై ఉన్నాయని.. కనురెప్పలు కూడా ఇంకా తెల్లగా ఉన్నాయని.. దీని కోసం తాను ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాని.. అది తీసుకోవడం తనకు మేలు చేసిందని ఆండ్రియా అన్నారు. ప్రస్తుతం ఆండ్రియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.