
మహేష్ బాబు మేనల్లుడు ఎంట్రి ఇచ్చిన అశోక్ గల్లా మరో సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే ఈ సారి తన వయస్సుకు తగినట్లుగా రొమాంటిక్ డ్రామా ఎంచుకోకుండా కమర్షియల్ సబ్జెక్ట్ తో వచ్చాడు. కొత్తగా కనిపించే ప్రయత్నం చేసాడు. ఫైట్స్, రొమాన్స్ పెద్ద హీరోలు చేసినట్లు చేసాడు.
అందుకు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ తోడైంది. బోయపాటి శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకత్వ ప్రతిభ యాడ్ అయ్యింది. మరి ఈ సినిమాతో అశోక్ గల్లా తెలుగు పరిశ్రమలో సెటిల్ అయ్యే హిట్ కొడతాడా..అసలు కథేంటి..సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథేంటి
కంసరాజు (దేవదత్త నాగే) చాలా క్రూరమైన వ్యక్తి. అతనంటే అందరికీ భయమే. అతను ఓ సారి కాశీ వెళ్లినప్పుడు అక్కడ ఓ శివ సాధువు అఘోరా కనపడి.. నీ చెల్లికు పుట్టే మూడో బిడ్డ వల్ల ప్రాణ హాని ఉందంటాడు. దాంతో కంసరాజు కడుపుతో ఉన్న చెల్లెలి (దేవయాని) భర్తను దారుణంగా చంపి, ఆ తర్వాత ఓ పోలీస్ ను చంపిన హత్య కేసులో 21 ఏళ్ల పాటు జైలుకు వెళతాడు.
అయితే అప్పటికే ఆమెకు ఓ కూతురు ఉంటుంది . ఆమె పేరు సత్య (మానస వారణాసి). ఓ పెళ్లిలో పరిచయం అయిన ఆమెతో కృష్ణ (అశోక్ గల్లా) ప్రేమలో పడతాడు. ఈలోగా కంసరాజు జైలు నుంచి బయిటకు వస్తాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు... కృష్ణ తన ప్రేమ కోసం ఏం చేసాడు..కంసరాజు కు కృష్ణకు మధ్య ఏం జరిగింది. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే
రీసెంట్ గా చాలా తెలుగు సినిమాలు మైథాలజీని మోడ్రన్ నేరేషన్ లో కలిపి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దేవకీనంద వాసుదేవ కూడా అలాంటి ప్రయత్నమే. కేవలం పైట్స్ మీద దృష్టి పెట్టి సీన్స్ తయారు చేసుకున్నారని అర్దమవుతుంది. ఎమోషనల్ సీన్స్ అయితే మరీ ఓవర్ గా అనిపిస్తాయి.
ఎక్కడా సీరియెస్ నెస్ ఉండదు. చాలా సీన్స్ ఫోర్సెడ్ గా ఇక్కడ కావాలి కాబట్టి వచ్చినట్లు ఉంటాయి. దాంతో సినిమా పై ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది. దానికి తోడు తెలిసిన మైథాలజీ భాగవతం నుంచి తీసుకున్న కథ కావటంతో ప్రెడిక్టుబుల్ గా సాగినట్లు అనిపిస్తుంది. అప్పటికీ కథను చాలా ట్వీక్ చేసారు. కానీ అవేమీ పండలేదు.
వాస్తవానికి సినిమాలో ట్విస్ట్ లు అన్నీ ఇంట్రస్టింగ్ గానే బాగున్నాయి. అయితే అవి పేపర్ మీదే ఇంపాక్ట్ చూపించినట్లున్నాయి. తెరమీదకు వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ కుదరలేదు. ఆ ట్విస్ట్ లు ఏమీ పేలలేదు. పేలవంగా మిగిలిపోయాయి.
దానికి తోడు అశోక్ గల్లాకు ఈ సినిమా యాప్ట్ కాలేదు. అతని వయస్సు, కటౌట్ కు తగ్గ కథ కాదది. యాక్షన్ ఓరియెంటెడ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథకు అతను సెట్ కాకపోవటంతో కనెక్ట్ అవటం కష్టమనిపించింది. మొదటి పదిహేను నిముషాల్లోనే మనకు విషయం అర్దమైపోతుంది. ఓవరాల్ గా చాలా చోట్ల బోర్ గా అక్కడక్కడా బాగుంటుంది.
ఎవరెలా చేసారు
అశోక్ గల్లాలో మంచి నటుడు ఉన్నా ఎలివేట్ అయ్యే అవకాసం ఇవ్వలేదు స్క్రిప్టు. సినిమాలో మెలోడ్రామా అతని నటనను మింగేసింది. చాలా ఫోర్స్ గా ఆ పాత్ర కనపడుతుంది. అలాగే సినిమాటెక్ వ్యవహారం బాగా ఎక్కువటం కూడా కలిసి రాలేదు.
ఇక హీరో,హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ అయితే దారుణం. లవ్ సీన్స్ లో చిన్నపాటి లాజిక్ కూడా కనపడదు. హీరో, విలన్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ లలో ఇంపాక్ట్ కనపడదు. హీరోయిన్ సోసోగా అనిపించింది. విలన్ గా చేసినతను బాగా చేసినా పాత్రలో డెప్త్ లేకపోవటంతో తేలిపోయింది.
టెక్నికల్ గా చూస్తే..
కథ,కథనం సినిమాను పూర్తిగా దెబ్బ తీసాయి. సినిమాటోగ్రాఫర్లు రసూల్ ఎల్లోర్ & ప్రసాద్ మూరెళ్ల , సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సినిమాకు ప్రాణం పెట్టి చేసిన టెక్నీషియన్లు. అయితే.. వారి కష్టం కలిసిరాలేదు. మిగతా డిపార్టమెంట్స్ సోసోగా నడిచిపోయాయి. డైరక్టర్ యాక్షన్ సీన్స్ తీయటంలోనే తన ప్రతిభను మరోసారి చూపించుకున్నారు. నిర్మాత బాలకృష్ణ మాత్రం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో భారీగా నిర్మించారు.
ఫైనల్ థాట్
మీరు అశోక్ గల్లా సినిమా ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా ఈ వీకెండ్ ఆప్షన్. లేదా కథతో సంభందం లేకుండా యాక్షన్ సీన్స్ ఎంజాయ్ చేస్తాను అనుకున్నా వెళ్లచ్చు.
Rating:2
Read more: సత్యదేవ్ `జీబ్రా` మూవీ రివ్యూ, రేటింగ్
also read: విశ్వక్ సేన్ `మెకానిక్ రాకీ` మూవీ రివ్యూ, రేటింగ్..