ప్రభాస్‌తో రిలేషన్‌, బాలయ్య ప్రమేయం ఇదేనా, షర్మిలా చెప్పిన నిజాలు.. దీనంతటికి కారణం ఆయనే!

First Published | Nov 22, 2024, 7:00 PM IST

ప్రభాస్‌, షర్మిలా మధ్య రిలేషన్ ఉందంటూ చాలా సార్లు సోషల్‌ మీడియాలో, రాజకీయంగా రూమర్స్ రచ్చ చేశాయి. ఇప్పుడు షర్మిలా దీనిపై స్పందించింది. ఈ వివాదంలోకి బాలయ్యని లాగడం షాకిస్తుంది. 
 

ప్రభాస్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన భారీ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. అందరి చేత డార్లింగ్‌ అనిపించుకుంటున్నారు. సేవా గుణంలోనూ ఆయనది పెద్ద చేయి అనే విషయం తెలిసిందే. ఏ సాయం చేయాల్సి వచ్చినా టాలీవుడ్‌లో అందరికంటే ఆయనే ఎక్కువ సాయం చేస్తుంటారు. అలాంటి ప్రభాస్‌పై పలు రూమర్స్ ఉన్నాయి. అనుష్కని పెళ్లి చేసుకోబోతున్నారనే రూమర్‌ చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇది కాకుండా రాజకీయంగా దుమారం రేపే మరో పెద్ద రూమర్‌ ఉంది. అదే ప్రభాస్‌కి, షర్మిలాకి మధ్య సంబంధం. ఈ ఇద్దరికి రిలేషన్‌షిప్‌ ఉందని చాలా కాలంగా వినిపించే మాట. రాజకీయంగానూ బాగా వినిపిస్తున్న మాట. ఇండస్ట్రీలోనూ ఈ రూమర్ తరచూ చక్కర్లు కొడుతూనే ఉంది.

దీనిపై అటు షర్మిలా కానీ, ఇటు ప్రభాస్‌ కానీ స్పందించలేదు. పైగా దీన్ని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకి దీనిపై రియాక్ట్ అయ్యింది ఏపీ కాంగ్రెస్‌ నాయకురాలు, జగన్‌ చెల్లి షర్మిలా. ప్రభాస్‌తో రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్‌ వివాదంలోకి బాలయ్యని లాగింది. 
 


ప్రభాస్‌ ఎవరో తనకు తెలియని షాకింగ్‌ కామెంట్స్ చేసింది. ఇప్పటి వరకు ఆయన్ని చూడలేదని, కలవలేదని స్పష్టం చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, ప్రభాస్‌తో లింక్‌ క్రియేట్‌ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డినే అని సంచలన ఆరోపనలు చేసింది. బాలకృష్ణ నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్‌ నుంచి తనపై తప్పుడు ప్రచారం జరిగిందని,

దీనిపై జగన్‌ కేసు పెట్టినట్టు ఇప్పుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా చెబుతున్నాడని, నిజంగానే చెల్లెలిపై జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్‌ ఐపీ అడ్రస్‌ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే, గత ఐదేళ్లుగా ముఖ్యంగా ఉండి గాడిదలు కాశారా అని రెచ్చిపోయింది షర్మిలా. 
 

ys jagan

బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదని, మీరిప్పుడు చెల్లెలిపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభాస్‌కి తనకు సంబంధం ఉందని జరిగిన అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదన్నారు షర్మిలా. ప్రభాస్‌ అనే వ్యక్తిని తాను ఇంత చూడలేదని, ఆయన ఎవరో కూడా తెలియదు అని చెప్పింది షర్మిలా. తనపై ప్రభాస్‌ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీనే అసత్య ప్రచారాలు చేసిందని ఆరోపించింది.

ప్రభాస్‌తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్‌ తన సైతాన్‌ సైన్యంతో సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ మొత్తంలో ప్రభాస్‌, షర్మిలా రిలేషన్‌కి సంబంధించి బాలయ్యని లాగడం షాకిస్తుంది. ఇది అటు రాజకీయంగా, ఇటు సోషల్‌ మీడియాలో, ఇంకోవైపు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది.  

ప్రభాస్‌ ఇటీవలే `కల్కి 2898 ఏడీ` సినిమాతో దుమ్ములేపారు. ఇది 11వందల కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు `ది రాజా సాబ్‌` మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. దీనికి `పౌజీ` అనే పేరు వినిపిస్తుంది. వీటితోపాట సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, అలాగే `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాల్లో నటించాల్సి ఉంది ప్రభాస్. ఈ మూవీస్‌తో ఆయన అంతర్జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేయబోతున్నారు. 

read more: సత్యదేవ్‌ `జీబ్రా` మూవీ రివ్యూ, రేటింగ్‌

also read: విశ్వక్‌ సేన్‌ `మెకానిక్‌ రాకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌..

Latest Videos

click me!