కోర్టు కు ఎక్కిన శేఖర్‌ కమ్ముల 'కుబేర' వివాదం.. ఏం తేలనుందో?

First Published Apr 16, 2024, 8:30 AM IST

ఎంతటి న్యాయపోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు .ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు.

shekar Kammula Kubera


ప్రతీ పెద్ద సినిమాకు ఏదో ఒక వివాదం చుట్టుముడుతోంది. కొన్ని కాపీ కథలు అంటూ వివాదాలు వస్తూంటే మరికొన్ని టైటిల్ వివాదాలు, లేక సినిమాలో ఫలానా కులం వారినో,మతం వారినో ఏదో అన్నారంటూ వివాదం..ఇలా ఊహించని వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే నిర్మాతలు ఓపిగ్గా వాటిన్నటిని క్లియర్ చేసుకుని సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మొదటి నుంచి శేఖర్ కమ్ముల సినిమాలకు పెద్దగా వివాదాలు లేవు. కానీ ఇప్పుడు  ఓ వివాదం చుట్టముట్టింది. వివరాల్లోకి వెళితే...

Kubera


తమిళ  స్టార్ హీరో ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో  ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. నాగార్జున కూడా ఈ మూవీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి 'కుబేర' అనే టైటిల్ పెట్టారు. ఇక ఫస్ట్ లుక్ టీజర్ కూడా అసలు ఊహించని విధంగా క్రేజీగా ఉంది. ధనుష్‌‌ను మాసిపోయిన గడ్డం, బికారీలా చూపించారు.   కుబేర అంటూ ధనుష్‌ని ఇలా చూపించేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే ఈ లుక్ చూస్తుంటే శేఖర్ కమ్ముల.. ధనుష్‌ క్యారెక్టర్‌ను చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.


 ‘కుబేర’ టైటిల్‌ తమదని, దాన్ని వేరేవారు కాపీ కొట్టి సినిమా తీయడం అన్యాయమని నిర్మాత కర్మికొండ నరేంద్ర ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుబేర’ టైటిల్‌ను తెలంగాణ ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్‌ చేసుకున్నామని, ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్‌ దశలో ఉన్నదని చెప్పారు.

Actor Dhanush and Director Shekar Kammula


తాము రిజిస్టర్‌ చేసుకున్న టైటిల్‌ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌ వారు కాపీ కొట్టి ఇటీవల సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారని అన్నారు. దీనిపై ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ‘కుబేర’ టైటిల్‌ విషయంలో ఎంతటి న్యాయపోరాటానికైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ టైటిల్‌ తమకే దక్కేలా ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చర్యలు తీసుకోవాలని నరేంద్ర కోరారు.


ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నారు.
 


ఇక అప్పట్లో శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లీడర్ చిత్రం తాజాగా కాపీ వివాదంలో చిక్కుకుంది. ఈ మేరకు రైటర్స్ అశోషియేషన్ లో కంప్లైంట్ నమోదైంది. శివ అనే దర్శకత్వ విభాగానికి చెందిన వ్యక్తి ఒకరు లీడర్ కథ,తన కథ నుంచే వచ్చిందని పాతిక లక్షలు రూపాయలు చెల్లించాలని పట్టుబట్టినట్లుగా చెప్పుకున్నారు. ఆ మేరకు అశోషియేషన్ వారు ఇరు పక్షాలను కూర్చోబెట్టినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తాను రూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు అన్నారు. 

Dhanush, shekar kammula


ఎందుకంటే తాను ఎంత కట్టినా కథా చౌర్యానికి పాల్పడినట్లేనని,తనకు కథను కాపీ కొట్టే అవసరం లేదని శేఖర్ వాదిస్తున్నారని చెప్పారు.  ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు రాణా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇది సమకాలీన అంశాలతో కూడిన పొలిటికల్ ధ్రిల్లర్ . ఫ్రఖ్యాత సంస్ధ ఏవియం వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

 సెన్సిబుల్ డైరెక్టర్‌గా శేఖర్ కమ్ములకు మంచి పేరు ఉంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా ఇప్పుడు లవ్ స్టోరీ ఇలా ఏ సినిమా తీసుకున్నా శేఖర్ కమ్ముల మార్క్ కనిపిస్తుంది. రక్తపాతం, హీరోయిజం, కామెడీ, వల్గారిటీ, ఓవర్ ఎక్స్ పోజింగ్ లాంటి కమర్షియల్ ముడిసరుకుని ఉపయోగించుకోకుండా సినిమాని క్లాస్ అండ్ నీట్‌గా తీసి ప్రేక్షకులతో శెభాష్ అనిపించుకోవడం ఈ దర్శకుడి శైలి. కుబేర సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి.

click me!