మీరెక్కడుంటే అక్కడ పండగే.. నెటిజన్‌కి అనసూయ క్రేజీ రిప్లై.. ఒంటరిగా ఆ పనిచేయాలంటే భయమట..

Published : Apr 15, 2024, 11:11 PM ISTUpdated : Apr 16, 2024, 02:42 PM IST

అనసూయ గ్లామర్‌ ఫోటోలతో సోషల్ మీడియాని ఊపేసేది. కానీ ఇప్పుడు మారిపోయింది. చాలా తక్కువగా సందడి చేస్తుంది. కానీ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.   

PREV
15
మీరెక్కడుంటే అక్కడ పండగే.. నెటిజన్‌కి అనసూయ క్రేజీ రిప్లై.. ఒంటరిగా ఆ పనిచేయాలంటే భయమట..

యాంకర్‌, నటి అనసూయ.. ఇప్పుడు యాంకరింగ్‌ మానేసి సినిమాల్లోనే బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె పలు భారీ సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా చేస్తూ రాణిస్తుంది. కానీ ఏది చేసినా తన పాత్ర బలంగా ఉండేలా చూసుకుంటుంది. తనే సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఈ క్రమంలో అద్భుతమైన నటనతో మెప్పిస్తుంది. మెస్మరైజ్‌ చేస్తుంది. 

25

బుల్లితెరని అనసూయ వదిలేయడంతో ఆయా ఫ్యాన్స్ అంతా ఈ యాంకర్‌ అనుని చాలా మిస్‌ అవుతున్నారు. అయితే వారికోసం తరచూ ట్రీట్‌ ఇస్తూనే ఉంటుంది అనసూయ. గ్లామర్‌ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అందాల విందుని వడ్డించి ఖుషీ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా అభిమానులతో కాసేపు ఛాట్‌ చేసింది అనసూయ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్డించింది. 

35

ప్రస్తుతం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్టు తెలిపింది అనసూయ. షూటింగ్‌కి వెళ్తున్నట్టు తెలిపింది. వెకేషన్‌కి వెళ్లడం లేదా అంటే ఇప్పుడప్పుడే ఆ లగ్జరీ లేదని తెలిపింది. బుంగమూతి పెట్టి చిలిపిగా కవ్వించింది. ఇక మీరు ఏది చేసినా మాకోసమే కదా అని అడిగిన ఓ అభిమానికి స్పందిస్తూ, అది నిజమే అని, 50 శాతం మీకోసం, మరో యాభై శాతం తనకోసమని వెల్లడించింది. 
 

45

సోలో ట్రిప్‌ వెకేషన్‌ వెల్లడానికి సలహాలు ఇవ్వాలని అడిగితే, ఒకప్పుడు తనకు ఇలా సోలో ట్రిప్‌ అంటే భయమేసేదని, ఇప్పుడు ఆలోచిస్తున్నానని, ఇప్పుడు ఓకే అనే విషయాన్ని చెప్పింది అనసూయ. ఈ సందర్భంగా ఓ అభిమాని గట్టిగా సోప్‌ వేశాడు అనసూయకి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ సంబరమే అని చెప్పాడు. దీంతో ఉప్పొంగిపోయింది అనసూయ. మీరు ఎంత స్వీట్‌ పర్సన్‌ అండి అంటూ ఖుషీ చేసింది. ప్రస్తుతం అనసూయ ఈ చాట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
 

55
anasuya instagram

ఇక అనసూయ.. గతేడాది `మైఖేల్‌`, `రంగమార్తాండ`, `విమానం`, `పెదకాపు`, `ప్రేమ విమానం` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది `రజాకార్‌` చిత్రంతో వచ్చింది. ఇందులో కేవలం ఒక్క పాటలోనే మెరిసింది అనసూయ. ప్రస్తుతం ఆమె `పుష్ప2`లో నటిస్తుంది. ఈ సినిమాతో రచ్చ చేయనుంది.దీంతోపాటు `ష్లాష్‌ బ్యాక్‌` అనే తమిళ చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories