పవన్ కళ్యాణ్ కి హీరో కార్తీ క్షమాపణలు! వివాదం ముగిసినట్లేనా?

First Published | Sep 24, 2024, 3:09 PM IST

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి హీరో కార్తీ క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఆయన వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. 
 

తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు నూనెలు కలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి టీటీడీ పాలకమండలిపై ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు. 
 

tirupati laddu

తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి తెచ్చారని అని కొందరు కొట్టి పారేస్తుండగా.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఓ వర్గం మండిపడుతుంది. 

ఇదిలా ఉంటే అనాలోచితంగా ఈ వ్యవహారం పై హీరో కార్తీ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ కి క్షమాపణలు చెప్పారు. ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్,  ఎలాంటి దురుద్దేశం లేకుండా నేను చేసిన కొన్ని కామెంట్స్ అపార్థానికి దారి తీశాయి. అందుకు క్షమాపణలు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు మన సాంప్రదాయాల పట్ల గౌరవం.. ఉంది అంటూ ట్వీట్ చేసి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు. 
 


Karthi, pawan kalyan


అసలు వివాదం ఏమిటని పరిశీలిస్తే...  కార్తి హీరోగా అరవింద్ స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యం సుందరం. కార్తీ అన్నయ్య వదినలు...  సూర్య, జ్యోతిక స్వయంగా నిర్మించారు.  సత్యం సుందరం చిత్రానికి 96 ఫేమ్ సీ. ప్రేమ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.  

ఈ సందర్భంగా యాంకర్... హీరో కార్తీ  ను ' లడ్డూ కావాలా నాయనా' అని ఫన్నీగా అడగడంతో.. వెంటనే రియాక్ట్ అయ్యారు కార్తీ . లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ… దానిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ జవాబు ఇచ్చాడు. లడ్డు గురించి ఏం మాట్లాడినా రాజకీయ దుమారం రేగే అవకాశం ఉంది. రాజకీయ అంశాలపై మనం మాట్లాడకపోతేనే మంచిది అన్న కోణంలో కార్తీ కామెంట్స్ చేశారు. 
 

హీరో కార్తీ వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. "లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు..ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు.అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని.. ఏదైనా మాట్లాడే ముందు.. ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి"అని  పవన్ కళ్యాణ్ అన్నారు.

Pawan Kalyan - Karthi

పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని కార్తీ క్షమాపణలతో చల్లార్చే ప్రయత్నం చేశారు. తెలుగులో మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తీ ఒకరు. రాజకీయ వివాదాల్లో తలదూర్చడం ద్వారా ఓ వర్గానికి దూరం కాకూడదని కార్తీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పారు. 

ఇక సత్యం సుందరం విషయానికి వస్తే... ఇది విలేజ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కార్తీ పల్లెటూరికి చెందిన అమాయకుడైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.  అరవింద స్వామి పట్నంలో ఉంటున్న పల్లెటూరి వ్యక్తి. వీరిద్దరూ బావబామ్మర్దులు. కార్తీ తన అమాయకత్వం, ప్రేమతో అరవింద స్వామి నవ్విస్తూ, ఏడిపిస్తూ ఉంటాడు. 

ట్రైలర్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 96 మూవీతో కోలీవుడ్ పరిశ్రమను ఆకర్షించాడు సి. ప్రేమ్ కుమార్. అదే సినిమాను తెలుగులో జాను గా రీమేక్ చేస్తే బెడిసి కొట్టింది. అలాంటి సెన్సిబుల్ డైరెక్టర్ నుండి వస్తున్న సత్యం సుందరం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తెలుగు అమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ గా నటించింది.

Latest Videos

click me!