కార్తీ 'లడ్డూ' కామెంట్స్ పై పవన్ సీరియస్ వార్నింగ్ , ప్రకాష్ రాజ్ కు కౌంటర్

First Published | Sep 24, 2024, 12:00 PM IST

ప్రకాష్ రాజ్‌కు కూడా చెపుతున్నా... సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. 

pawan kalyan, laddu, karthi, Prakash raj


ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు, మనోభావాలతో ముడిపడి ఉండటంతో పెద్ద రాజకీయ వివాదంగా రోజు రోజుకీ మారుతోంది. ఈ క్రమంలో  ఎవరి అభిప్రాయాలని వారు వెల్లడిస్తున్నారు.

కొందరు ఇదంతా రాజకీయ వివాదం అని కొంతమంది కొట్టిపడేస్తూ ఉన్నారు. లడ్డు కల్తీ కచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు.  అవన్నీ ప్రక్కన పెడితే సినిమా ప్రమోషన్ కు హైదరాబాద్ వచ్చి మీడియా వాళ్లు కదిపితే లడ్డు గురించి మాట్లాడి ఇరుక్కుపోయాడు తమిళ హీరో కార్తి. 
 


కార్తి, అరవింద్ స్వామి లీడ్ రోల్స్‌‌లో ‘జాను’ ఫేమ్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం సుందరం’ (Satyam Sundaram).  సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సోమవారం సెప్టెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.  ఈ సందర్భంగా యాంకర్... హీరో కార్తీ  ను ' లడ్డూ కావాలా నాయనా' అని ఫన్నీగా అడగడంతో..వెంటనే రియాక్ట్ అయ్యారు తమిళ హీరో కార్తీ . 
 



లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ… దానిపై మాట్లాడకూడదు అంటూ నవ్వుతూ కామెంట్స్ చేశారు.  'ప్రస్తుతం లడ్డూ టాపిక్ అస్సలు మాట్లాడుకోకూడదని ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా  లడ్డూ టాపిక్ సెన్సిటివ్గా మారిపోయిందని... ఇలాంటి సమయంలో దాని గురించి తక్కువ మాట్లాడడం బెటర్ అని వ్యాఖ్యానించాడు.  
 


అయితే ఈ వేడుకలో లడ్డుపై హీరో కార్తి మరియు యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. "లడ్డూ మీద జోక్స్ వేస్తున్నారు..ఓ సినిమా ఈవెంట్లో లడ్డూ అనేది సెన్సిటివ్ ఇష్యూ అని ఓ హీరో అన్నారు. మళ్ళీ ఇంకోసారి అనొద్దు అని పవన్ సూచించారు.

అలాగే ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని.. ఏదైనా మాట్లాడే ముందు.. ఒకటికి వందసార్లు ఆలోచించండి. సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు" పవన్ కళ్యాణ్. ప్రస్తుతం హీరో కార్తి చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 


అలాగే అభిమానులు కూడా ఎంతసేపు సినిమా టికెట్స్, హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. మరో ప్రక్క ఇప్పటికే లడ్డు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. వాటికి మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు. ఇక మంచు విష్ణు కామెంట్స్ పై ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు. 
 

Pawan Kalyan

అదే సమయంలో ప్రకాష్ రాజ్ కు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ .  ప్రకాష్ రాజ్‌కు కూడా చెపుతున్నా... సెక్యులరిజం టూవే.. ఒన్ వే కాదు.. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది.. కానీ ఆయన సరిగా మాట్లాడాలి. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా. మేం చాలా బాధపడ్డాం.. మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు‌. మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది. ఇష్టానికి సనాతన ధర్మం పై మాట్లాడుతున్నారు. మీరు సరస్వతీ దేవి, దుర్గాదేవిలపై జోకులు వేస్తారా. సనాతనధర్మ రక్షణ అనేది గుడికెళ్ళే ప్రతీ హిందువు బాధ్యత కాదా. ’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Latest Videos

click me!