ఈ చిత్రానికి విడుదల ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతం, స్టార్ కాస్ట్ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో స్టార్ హీరో శింబు కూడా నటించారు. అయితే విడుదలైన తర్వాత నెగటివ్ రివ్యూలు, మిశ్రమ స్పందన కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే ఆసక్తి నెలకొంది. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.