కనీసం ఒకటిన్నర రోజు చిత్రీకరించాల్సిన సన్నివేశం కేవలం మూడు గంటల్లో పూర్తయిపోయింది. ఎస్వీ రంగారావుకి పోటీగా కృష్ణంరాజు అద్భుతంగా నటించారట. వాళ్ళిద్దరూ అంత అద్భుతంగా నటిస్తుండడంతో దర్శకుడు కెమెరామెన్, ఇతరు యూనిట్ కూడా వేగంగా పనిచేసే మూడు గంటల్లో షూటింగ్ ఫినిష్ చేసేసారు.
షూటింగ్ పూర్తయ్యాక ఎస్వీ రంగారావు దర్శకుడు ప్రత్యగాత్మను పిలిచి.. కృష్ణంరాజు గురించి ఇలా అన్నారట. గొప్పోడిని పట్టావయ్యా.. వీడు భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదుగుతాడు అని అన్నారట. షూటింగ్ లోకేషన్ నుంచి ఆయన ఊరికి వెళ్లే వరకు చాలామందితో కృష్ణంరాజు నటన గురించి చెప్పి అభినందించారట. ఆ విధంగా కృష్ణంరాజు తన తొలి చిత్రంతోనే ఎస్వీ రంగారావు లాంటి లెజెండ్ దగ్గర ప్రశంసలు అందుకున్నారు.