సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీతోనే బాక్సాఫీస్ వసూళ్ల రికార్డు ప్రారంభం కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన Where is Pushpa? కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ ను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ థియేటర్లలోకి రాబోతోంది. చిత్రంలో రష్మిక మందన్న కథనాయిక. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.