`దేవర` ని వెంటాడుతున్న మూడు బ్యాడ్‌ సెంటిమెంట్లు.. ఎన్టీఆర్‌ దాన్ని బ్రేక్‌ చేయగలడా?

First Published | Mar 3, 2024, 5:11 PM IST

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` చిత్రం దసరా కి రాబోతుంది. అయితే ఈ మూవీని మూడు బ్యాడ్‌ సెంటిమెంట్లు వెంటాడుతున్నాయి. ఫ్యాన్స్ ని కలవరపెడుతున్నాయి. 
 

ఎన్టీఆర్‌ చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటించారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఇప్పుడు `దేవర` చిత్రంతో వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ఇది. భారీ బడ్జెట్‌, భారీ కాస్ట్యూమ్‌, లార్జ్ స్కేల్‌లో రూపొందుతుంది. ఈ మూవీపై ఎన్టీఆర్‌ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీనితో పాన్‌ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ కూడా చాలా కీలకంగా మారింది. 
 

అయితే `దేవర`ని మాత్రం మూడు ప్రధానమైన బ్యాడ్‌ సెంటిమెంట్లు వెంటాడటం గమనార్హం. మరి అవెంటో చూస్తే, ఎన్టీఆర్‌ చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాలో నటించారు. ఇది పెద్ద హిట్‌ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. జనరల్‌గా రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత నటించే చిత్రం డిజాస్టర్‌ అవుతుంది. ప్రారంభం నుంచి ఇదే సెంట్‌ మెంట్‌ నడుస్తుంది. ప్రభాస్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ విషయంలో గతంలోనూ ఇది జరిగింది. రాజమౌళి సినిమా చేశాక వారి నెక్ట్స్ మూవీస్‌ పరాజయం చెందాయి. 
 


 తారక్‌ చివరగా `ఆర్‌ఆర్‌ఆర్‌` చేశాడు. హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివతో `దేవర` చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కూడా పరాజయం చెందుతుందని అంటున్నారు. ఎందుకంటే `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత రామ్‌చరణ్‌ `ఆచార్య` చిత్రంలో నటించాడు. ఆ మూవీ డిజాస్టర్‌ అయ్యింది. దీంతో ఇక మిగిలింది ఎన్టీఆర్‌ మాత్రమే. ఈ లెక్కన `దేవర`కి పరాజయం తప్పదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని కలవర పెడుతుంది. 

మరోవైపు ఎన్టీఆర్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దేవర, వరగా కనిపిస్తారని సమాచారం. తండ్రి కొడుకుల పాత్రల్లో ఆయన కనిపిస్తాడట. గతంలోనూ ఎన్టీఆర్‌ `ఆంధ్రావాలా`, `శక్తి` సినిమాల్లో రెండు పాత్రలు పోషించాడు. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ కూడా `దేవర`ని వెంటాడుతుంది. మరి దీన్ని ఎన్టీఆర్‌ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. 
 

ఇదే కాదు మరో సెంటిమెంట్‌ కూడా తారక్‌ ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది. ఎన్టీఆర్‌ నటించిన దసరాకి విడుదలై విజయం సాధించలేదు. `దేవర` కూడా ఇప్పుడు దసరాకే రాబోతుంది. దీంతో `దేవర`ని కూడా ఈ బ్యాడ్‌ సెంటిమెంట్‌ పీడుస్తుంది. ఇది తారక్‌ అభిమానులను కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో వీటిని దాటుకుని ఎన్టీఆర్‌ `దేవర` సక్సెస్‌ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి. 
 

ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `దేవర`లో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుంది. సైఫ్‌ అలీ ఖాన్‌ నెగటివ్ రోల్‌ చేస్తున్నాడు. ఈ మూవీ సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌లో పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా రూపొందుతుంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కాబోతుంది. ఎన్టీఆర్‌ సోలో హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ఇది. 
 

Latest Videos

click me!