సినిమా విజయానికి కథ చాలా కీలకం. కొన్నిసార్లు మంచి కథలు కూడా సినిమాలని కాపాడలేవు. సినిమా విజయానికి దర్శకుడు తెరకెక్కించే విధానం, ఆడియన్స్ కి కనెక్ట్ కావడం లాంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. కొన్ని చిత్రాలు కథలు అద్భుతంగా ఉన్నా తెరకెక్కించిన విధానం వల్ల ఫ్లాప్ అవుతుంటాయి. ఆ కోవకి చెందిన చిత్రమే మహేష్ బాబు ఖలేజా.