ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. మరోసారి మ్యాజిక్‌కి నాగ్‌ రెడీ, దుల్కర్‌ విశ్వరూపం చూపిస్తాడా?

Published : Nov 10, 2025, 08:04 AM IST

ఈ శుక్రవారం ప్రధానంగా ఐదు సినిమాలు థియేటర్‌లోకి రాబోతున్నాయి. వీటిలో నాగార్జున `శివ`, దుల్కర్‌ `కాంతార`, `సంతాన ప్రాప్తిరస్తు`పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

PREV
16
ఈ శుక్రవారం థియేటర్లో విడుదలవుతున్న చిత్రాలివే

ఈ వారం(నవంబర్‌ 14న) పలు క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. అయితే ఇందులో పెద్ద సినిమాలు లేవు. రీరిలీజ్‌ అవుతున్న నాగార్జున `శివ` ఒక్కటే పెద్దది. ఆ తర్వాత దుల్కర్‌ సల్మాన్‌ మూవీ రాబోతుంది. వీటితోపాటు చాందినీ చౌదరీ నటించిన `సంతాన ప్రాప్తిరస్తు`తోపాటు `జిగ్రిస్‌` అనే మరో యూత్‌ఫుల్‌ క్రేజీ మూవీ ఉంది. మరోవైపు ఓ డబ్బింగ్‌ చిత్రం ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. ఏ ఏ సినిమా ఏ జోనర్‌లో వస్తుంది. ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరు నటిస్తున్నారనేది తెలుసుకుందాం.

26
36ఏళ్ల తర్వాత `శివ ` రీ రిలీజ్‌

ఈ వారం పెద్ద సినిమా అంటే నాగార్జున నటించిన `శివ` అనే చెప్పాలి. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. స్ట్రెయిట్‌ మూవీ కోసం కష్టపడ్డట్టుగానే ఈ రీ రిలీజ్‌ కోసం నాగ్‌, రామ్‌గోపాల్‌ వర్మ కష్టపడ్డారు. 36ఏళ్ల(1989 అక్టోబర్‌ 5) క్రితం వచ్చిన ఈ సినిమా ఇండియన్‌ సినిమాలోనే ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అందరి చేత వాహ్‌ అనిపించింది. ఇందులో నాగార్జునకి జోడీగా అమల నటించగా, రఘువరన్‌, జేడీ చక్రవర్తి నెగటివ్‌ రోల్స్ చేశారు. ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇన్నాళ్లకి మళ్లీ దీన్ని మళ్లీ రిలీజ్‌ చేస్తుండటంతో అందరినిలోనూ ఆసక్తి నెలకొంది. బిగ్‌ స్టార్స్ అందరూ ఈ మూవీకి సంబంధించిన తమ మెమొరీస్‌ని పంచుకోవడంతో ఈ వారం వచ్చే సినిమాల్లో దీనికే మంచి క్రేజ్‌ ఉందని చెప్పొచ్చు. మరి 36ఏళ్ల నాటి మ్యాజిక్‌ మరోసారి రిపీట్‌ అవుతుందా అనేది చూడాలి.

36
దుల్కర్‌ సల్మాన్‌ `కాంత`

నవంబర్‌ 14న విడుదల కాబోతున్న మరో పెద్ద సినిమా అంటే దుల్కర్‌ సల్మాన్‌ నటించిన `కాంత` అనే చెప్పాలి. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. 1950-60 నేపథ్యంలో సినిమా బ్యాక్‌ డ్రాప్‌లోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. స్పిరిట్‌ మీడియా, వేఫేరర్‌ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. రానా, దుల్కర్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌ నిర్మాతలు. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. దుల్కర్‌ మూవీ అంటే మినిమమ్‌ గ్యారంటీ అనే టాక్‌ ఉంది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

46
సంతాన సమస్య నేపథ్యంలో కామెడీ

ఈ శుక్రవారం రాబోతున్న మరో క్రేజీ మూవీ `సంతాన ప్రాప్తిరస్తు`. సంతానం కోసం పడే ఇబ్బందుల నేపథ్యంలో ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజీవ్‌ రెడ్డి. విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించగా, మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్ బ్యానర్‌పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఫుల్‌ ఫన్‌తో రాబోతున్న ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. మరి ఏమాత్రం నవ్విస్తుందో చూడాలి.

56
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా `జిగ్రీస్‌`

రామ్‌ నితిన్‌, కృష్ణ బురుగుల, ధీరజ్‌ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌ `జిగ్రీస్‌`. హరీష్‌ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. జెంజీ కామెడీతో వస్తోన్న ఈ మూవీపై ఒకలాంటి క్రేజ్‌ ఏర్పడింది. ట్రెండ్‌ కి తగ్గ కామెడీ కావడంతో యువత చూసే అవకాశాలున్నాయి. మరి థియేటర్ల ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. దీనికి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం పెద్ద మైనస్‌.

66
డబ్బింగ్‌ చిత్రం `గత వైభవం`

వీటితోపాటు మరో డబ్బింగ్‌ మూవీ `గత వైభవం` ఈ శుక్రవారమే రాబోతుంది. ఆషికా రంగనాథ్‌, దుశ్యంత్‌ జంటగా నటించారు. సింపుల్‌ సుని దర్శకత్వం వహించారు. సర్వెగర సిల్వర్‌ స్క్రీన్‌, సుని సినిమాస్‌ పతాకాలపై దీపక్‌ తిమ్మప్ప, సుని నిర్మించారు. ఒక ఎపిక్‌ ఫాంటసీ డ్రామాగా ఇది రూపొందింది. ఈ నెల 14న తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తోంది. ఇలా ఐదు సినిమాలు ఈ శుక్రవారం ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది ఆడియెన్స్ ని మెప్పిస్తుందనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories