
ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. కిరణ్ అబ్బవరం కె ర్యాంప్, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3, జురాసిక్ వరల్డ్ రీ బర్త్ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఆ వివరాలు, రిలీజ్ డేట్ లు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎ మేరీ లిటిల్ ఎక్స్ మాస్ (A Merry Little Ex-Mas)
క్రిస్మస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ హాలిడే కామెడీ సినిమాలో అలీషియా సిల్వర్‌స్టోన్, ఒలివర్ హడ్సన్, జమీలా జమీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో కేట్, ఎవెరెట్ అనే దంపతులు విడాకుల తర్వాత కూడా ఒక చివరి కుటుంబ సెలవును కలిసి గడపాలని నిర్ణయించుకుంటారు. కానీ విధి వారికి మరో సర్ప్రైజ్‌ను సిద్ధం చేస్తుంది.
విడుదల తేదీ: నవంబర్ 12
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3(Delhi Crime Season 3)
ఢిల్లీ క్రైమ్ సిరీస్‌కి మూడో సీజన్ వస్తోంది. ఈ సీజన్‌లో హుమా ఖురేషీ కొత్త విలన్‌గా కనిపిస్తారు. షెఫాలీ షా మళ్లీ డీసీపీ వర్తికా చతుర్వేది పాత్రలో, జయ భట్టాచార్య విమ్లా భారద్వాజ్‌గా నటిస్తున్నారు.
విడుదల తేదీ: నవంబర్ 13
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
ది బీస్ట్ ఇన్ మీ (The Beast In Me)
క్లెయిర్ డేన్స్, మాథ్యూ రైస్, బ్రిట్టనీ స్నో ప్రధాన పాత్రల్లో నటించిన ఈ థ్రిల్లర్ ఒక రచయిత్రి జీవితంలోకి అడుగుపెట్టిన ప్రమాదకరమైన పొరుగు వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను హత్యాకాండల వెనుక ఉన్నాడా అనే మిస్టరీ కథానాయికను ఒక మైండ్ గేమ్‌లోకి లాగుతుంది.
విడుదల తేదీ: నవంబర్ 13
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
లాస్ట్ సమురాయ్ స్టాండింగ్ (Last Samurai Standing)
జపాన్ మేజీ యుగం (19వ శతాబ్దం చివర) నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్ షోగో ఇమమురా నవల ఆధారంగా రూపొందింది. కియోటో నగరంలోని టెన్‌ర్యూజీ ఆలయంలో సాగే సమురాయి యోధుల కథ ఇది. జునీచి ఒకడా, యుమియా ఫుజిసాకి, కయా కియోహారా ప్రధాన పాత్రల్లో నటించారు.
విడుదల తేదీ: నవంబర్ 13
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
ఇన్ యువర్ డ్రీమ్స్ (In Your Dreams)
అలెక్స్ వూ దర్శకత్వంలో రూపొందిన అమెరికన్ యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు సరైన ఎంపికగా నిలుస్తుంది.
విడుదల తేదీ: నవంబర్ 14
ఎక్కడ చూడాలి: నెట్‌ఫ్లిక్స్
జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth)
ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా Jurassic World Dominion (2022)కి స్టాండలోన్ సీక్వెల్. Jurassic Park ఫ్రాంచైజ్‌లో ఏడవ చిత్రం ఇది. స్కార్లెట్ జోహాన్సన్, మహర్షల అలీ, జోనాథన్ బైలీ ప్రధాన పాత్రల్లో నటించారు. కథలో ఒక శాస్త్రవేత్తల బృందం మూడు డైనోసార్ జాతుల డీఎన్‌ఏ సేకరించడానికి ప్రమాదకర ద్వీపానికి ప్రయాణిస్తుంది.
విడుదల తేదీ: నవంబర్ 14
ఎక్కడ చూడాలి: జియోహాట్‌స్టార్
ఇన్స్పెక్షన్ బంగ్లా (Inspection Bungalow)
అరవాంగడ్ పోలీస్ స్టేషన్ కోసం స్థలం వెతికే వ్యక్తి ఒక అడవిలోని పాత ఇన్‌స్పెక్షన్ బంగ్లాను ఎంచుకుంటాడు. కానీ ఆ భవనం శపించబడిందనే పుకార్లు అతని జీవితం తారుమారు చేస్తాయి. హారర్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన చిత్రం.
విడుదల తేదీ: నవంబర్ 14
ఎక్కడ చూడాలి: జీ5
దశావతార్ (Dashavatar)
సుబోధ్ ఖనోల్కర్ దర్శకత్వం వహించిన ఈ మరాఠీ థ్రిల్లర్‌లో దిలీప్ ప్రభావల్కర్, భరత్ జాధవ్, మహేశ్ మంజ్రేకర్, సిద్ధార్థ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వృద్ధుడైన డశావతార్ నటుడు తన చివరి నాటకం ద్వారా ఆధ్యాత్మిక, సాంస్కృతిక యుద్ధంలో చిక్కుకుంటాడు.
విడుదల తేదీ: నవంబర్ 14
ఎక్కడ చూడాలి: జీ5
కె ర్యాంప్
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటించిన కె ర్యాంప్ చిత్రం థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతోంది.
విడుదల తేదీ : నవంబర్ 15
ఎక్కడ చూడాలి : ఆహా