
కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో ఈ రోజు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు ఉన్నావు అంటాడు కార్తీక్. అవును బావ అంటుంది దీప. ఎందుకు చేయరు. సీఈఓ అవుతోంది కదా.. ఇద్దరు కలిసే అన్ని చేస్తారు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ గ్రానీ ఏంటీ ఇంకా రాలేదు అని ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఎంట్రీ ఇస్తుంది పారు. అది చూసిన జ్యోత్స్న.. గ్రానీ ఏంటీ మమ్మీని తీసుకొని వస్తోంది అని అనుకుంటుంది. నువ్వేంటి మమ్మీ ఆఫీసుకి వచ్చావు అంటుంది జ్యోత్స్న. రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటుంది సుమిత్ర.
మీరేందుకు ఆఫీసుకు వచ్చారు అంటాడు శివన్నారాయణ. దీప రాగా లేనిది మేమేస్తే తప్పేంటి? అంటుంది పారు. తప్పు అని నేను అన్నానా? అంటాడు శివన్నారాయణ. నేను మీతో మాట్లాడాలి అంటుంది పారు. ఇప్పుడే అదే చేస్తున్నావు కదా అంటాడు శివన్నారాయణ. విడిగా మాట్లాడాలి అంటుంది పారు. సరే పదా అని పక్కకు వెళ్తాడు శివన్నారాయణ. వెనకాలే వెళ్తారు కార్తీక్, జ్యోత్స్న.
దీప సీఈఓ ఏంటి? అంటుంది పారు. ఆఫీసు విషయాలు నీకెందుకు అంటాడు శివన్నారాయణ. నా మనుమరాలిని కాదని ఓ పనిమనిషిని సీఈఓ చేస్తే నేను ఊరుకోను అంటుంది పారు. దీప సీఈఓ అని ఎవరు చెప్పారని అడుగుతాడు శివన్నారాయణ. ఇంకెవరు చెప్తారు జ్యోత్స్న చెప్పుంటుంది అంటాడు కార్తీక్. నేను చెప్పడం నువ్వు చూశావా బావ అంటుంది జ్యోత్స్న. మరి పారిజాతానికి ఎవరు చెప్పారు అంటాడు శివన్నారాయణ. అయినా నేను దీపను సీఈఓగా చేయాలని అనుకోలేదు. కానీ నువ్వు చెప్పాక అది మంచి ఆలోచనే అనిపిస్తోంది. థాంక్స్ పారిజాతం మంచి సలహా ఇచ్చినందుకు అంటాడు శివన్నారాయణ. షాక్ అవుతారు పారు, జ్యో. నా భార్యను సీఈఓ చేయమన్నందుకు థాంక్స్ పారు అంటాడు కార్తీక్.
గ్రానీ నువ్వు వచ్చిన పనేంటి? చేస్తున్న పనేంటి అంటుంది జ్యోత్స్న. ఓ పిచ్చిదాన వాళ్లు మనల్ని వెర్రివాళ్లను చేస్తున్నారే.. నేను అడిగాను కాబట్టి ఆ ఆలోచన నేను ఇచ్చాను అంటున్నారు. నేను అడకపోయినా వాళ్లు దీపనే సీఈఓ చేస్తారు అంటుంది పారిజాతం. అదే కదా నేను కూడా చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దాం గ్రానీ అంటుంది జ్యోత్స్న. సీఈఓగా దీప పేరు చెప్పనివ్వు.. ఒక్క పోటు పొడిచి దాన్ని పై లోకాలకు పంపిస్తాను అని కత్తి చూపిస్తుంది పారు. నిజంగా చంపుతావా అంటుంది జ్యోత్స్న. నా మనుమరాలి జోలికి వస్తే నేను ఊరుకునేదే లేదు. దీప పేరు అనౌన్స్ చేయని ఏం చేస్తానో నువ్వే చూస్తావు అంటుంది పారు. ఆ మాటతో కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది జ్యోత్స్న.
మరోవైపు కాంచన దగ్గరకు వస్తాడు శ్రీధర్. భోజనం చేస్తూ ఉంటుంది కాంచన. ఇంట్లో ఎవ్వరూ లేనట్లు ఉన్నారు అంటాడు. కార్తీక్, దీప డ్యూటీకి వెళ్లారు. అనసూయ అక్క పనుందని బయటకు వెళ్లింది. శౌర్య స్కూల్ కి వెళ్లింది అని చెప్తుంది కాంచన. నాకు బాగా ఆకలిగా ఉంది. నీతో పాటు తినొచ్చా అంటాడు శ్రీధర్. ప్లేటు తెస్తాను అని కాంచన వెళ్లబోతుండగా.. నేను తెచ్చుకుంటాను అని వెళ్తాడు శ్రీధర్. ప్లేటు తీసుకొని అన్నం వడ్డించుకుంటాడు. టమాటా పచ్చడిని చూసి ఇష్టంగా వేసుకొని తింటాడు.
ఇది నువ్వే చేశావు కదా. అదే టేస్ట్. రెండు సంత్సరాలు వెనకకు వెళ్లాను అంటాడు శ్రీధర్. నువ్వు నాకోసం ఓసారి ఈ పచ్చడి పెట్టావు అని పాత రోజులు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాంచన మాత్రం వారు విడిపోయిన విషయాన్నే గుర్తు చేసుకుంటుంది. ఇంకా ఎన్నిరోజులు కాంచన ఇలా.. నీ మెడలో ఉన్న తాళిని చూసినప్పుడైనా నేను నీకు గుర్తుకు రానా? అంటాడు శ్రీధర్. ఎందుకు గుర్తుకురారు. ఆ తాళికట్టిన చేయి మూడు ముళ్లు కాదు.. ఆరు మూళ్లు వేసింది అంటుంది కాంచన. సిగ్గుతో తల దించుకుంటాడు శ్రీధర్.
మీరు కూడా కూర్చొని తినమని కార్తీక్, దీపలను అంటాడు శివన్నారాయణ. అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. దీపకు వడ్డిస్తాడు కార్తీక్. దీప వంటలను మెచ్చుకుంటాడు దశరథ. జ్యోత్స్న దగ్గరికి వెళ్లి నేను ఎందుకు నీకు తోడు కావాలని కోరుకున్నానో నీకు అర్థమైందా జ్యోత్స్న అంటుంది సుమిత్ర. ఇక్కడ ఒకరికి మరొకరు తోడుగా ఉన్నారు. నీకే ఎవ్వరూ లేరు.. ఇప్పటికైనా అర్థం చేసుకొని పెళ్లి చేసుకో అంటుంది సుమిత్ర. నేను అనుకున్నది సాధించాకే అవన్నీ మమ్మీ అంటుంది జ్యోత్స్న. పక్కకు వెళ్తుంది సుమిత్ర. గ్రానీ దీపను చంపేస్తే ఆ ప్లేస్ నాదే మమ్మీ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కొత్త సీఈఓ ఎవరని అడుగుతారు బోర్డ్ మెంబర్స్. ఇంకెవరూ తన రక్త సంబంధమే అని చెప్తుంది పారు. నువ్వు కొంచెం ఆగు పారిజాతం అంటాడు శివన్నారాయణ. సుమిత్ర వైపు చూసి నాతో ఏమైనా చెప్పాలా అమ్మా అంటాడు శివన్నారాయణ. ఏం లేదు మామయ్య గారు.. ఈ సంస్థని నిలబెట్టింది మీరు. దీనికోసం ఏం చేయాలో మీకు తెలుసు. మీ నిర్ణయమే మా నిర్ణయం అంటుంది సుమిత్ర. నువ్వు కూడా వెన్నుపోటు పొడిచావు కదా సుమిత్ర అని మనసులో అనుకుంటుంది పారు.
కార్తీక్ మనం అనుకున్నది చెప్పు అంటాడు శివన్నారాయణ. నేను ఈ సంస్థలో ఉన్నా.. లేకపోయినా నా సేవలు, సహకారం ఎప్పుడూ ఈ సంస్థకు ఉంటూనే ఉన్నాయి. మనం ఎప్పుడూ ఫ్యామిలీ మెంబర్స్ లాగే కలిసి పనిచేశాం. ఇకపై కూడా అలాగే పనిచేయబోతున్నాం. నేను సీఈఓగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి.. కొత్త సీఈఓగా నేను నా భార్య దీప పేరును ప్రపోజ్ చేస్తున్నానని చెప్తాడు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.