Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు

Published : May 11, 2026, 06:55 AM IST

This Week OTT Releases: ఈ వారం OTT ప్రేక్షకుల కోసం యాక్షన్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా, సూపర్‌నేచురల్ కథలతో పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి.

PREV
14
This Week OTT Releases

ఈ వారం OTT ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ రెడీగా ఉంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, హీస్ట్ డ్రామా, సూపర్‌నేచురల్ కథలు ఇలా విభిన్న జానర్లలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ నటించిన కర్తవ్య, అలాగే బెర్లిన్ సీజన్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ వారం ఏ OTTలో ఏం రిలీజ్ అవుతోందో చూసేద్దాం.

24
Netflix

Kartavya

సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో ఓ పోలీస్ ఆఫీసర్ తన కుటుంబం, తన విధి మధ్య చిక్కుకుపోతాడు. కుటుంబానికి ప్రమాదం ఏర్పడినప్పుడు అతడు తీసుకునే నిర్ణయాలే కథకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయి. ఎమోషన్‌తో పాటు యాక్షన్ కూడా బలంగా ఉండబోతోందని టాక్.

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: May 15, 2026

Berlin Season 2

Money Heist స్పిన్-ఆఫ్‌గా వచ్చిన Berlin మొదటి సీజన్ మంచి స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు రెండో సీజన్‌లో బెర్లిన్ మరో భారీ దోపిడీకి ప్లాన్ చేస్తాడు. ఈసారి లియోనార్డో డా విన్చీ మాస్టర్‌పీస్‌ను దొంగిలించే ప్రయత్నం కథలో ప్రధాన అంశం.

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: May 15, 2026

The Wonderfools

పార్క్ యున్-బిన్, చా యున్-వూ నటించిన ఈ కొరియన్ సిరీస్‌లో సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తులు వాటిని కంట్రోల్ చేయలేక ఎదుర్కొనే సమస్యలను చూపించనున్నారు. ఫాంటసీ, కామెడీ, డ్రామా మిక్స్‌గా ఈ సిరీస్ రూపొందింది.

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: May 15, 2026

Devil May Cry Season 2

డెమన్ హంటర్ డాంటే కథ కొనసాగుతున్న ఈ యానిమేటెడ్ సిరీస్ రెండో సీజన్ మరింత డార్క్ యాక్షన్‌తో రాబోతోంది. తన కుటుంబాన్ని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే డాంటే ప్రయాణం ఈ సీజన్‌లో మరింత తీవ్రంగా మారుతుంది.

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: May 12, 2026

Dhurandhar 2

రణవీర్ సింగ్ నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన అధికారిక OTT రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ వారం Netflixలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం ఓటీటీఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎక్కడ చూడాలి: Netflix

రిలీజ్ డేట్: అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

34
Prime Video

Exam

పరీక్షా పేపర్ లీక్ మాఫియాను బయటపెట్టేందుకు ప్రయత్నించే యువతి కథ ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ సిరీస్ ఇది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, వాటి వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను ఈ సిరీస్‌లో చూపించనున్నారు.

ఎక్కడ చూడాలి: Prime Video

రిలీజ్ డేట్: May 15, 2026

44
JioHotstar

The Punisher One Last Kill

ఫ్రాంక్ క్యాసిల్ జీవితంలో ప్రతీకారానికి ముగింపు పలకాలని అనుకున్న సమయంలో మరో ప్రమాదకరమైన సంఘటన అతడిని మళ్లీ యుద్ధంలోకి లాగుతుంది. యాక్షన్ అభిమానులకు ఇది మంచి ట్రీట్‌గా ఉండొచ్చు.

ఎక్కడ చూడాలి: JioHotstar

రిలీజ్ డేట్: May 12, 2026

Read more Photos on
click me!

Recommended Stories