OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్

Published : Dec 22, 2025, 07:00 AM IST

రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటాతో పాటు పలు చిత్రాలు, సిరీస్ లు ఈ వారం ప్రేక్షలకు ముందుకు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. 

PREV
15
This Week OTT Releases

డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 2025 వరకు ప్రముఖ ఓటీటీ సంస్థలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. హిస్టారికల్ డ్రామాలు, స్పై థ్రిల్లర్లు, డాక్యుమెంటరీలు, రీజినల్ ఫ్యామిలీ డ్రామాలు, సూపర్‌నేచురల్ సిరీస్‌లు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఈ వారంలో అందుబాటులోకి రాబోతోంది. నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, జీ 5, సన్ నెక్స్ట్, లలో రిలీజయ్యే చిత్రాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

25
జియో హాట్ స్టార్ లో రిలీజయ్యేవి

అమేడియస్

పిటర్ షాఫర్ టోనీ అవార్డ్ విన్నింగ్ నాటకానికి పునఃరూపకల్పనగా రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామా ఐదు ఎపిసోడ్‌లుగా వస్తోంది. 18వ శతాబ్దంలో వియన్నాకు వచ్చిన యువ సంగీతకారుడు వోల్ఫ్‌గాంగ్ అమేడియస్ మోజార్ట్ జీవితం, అతని ఎదుగుదల, కోర్ట్ కంపోజర్ ఆంటోనియో సలియేరితో ఉన్న పోటీ ఈ కథలో ప్రధానాంశాలు.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 22 2025

కోపెన్‌హేగన్ టెస్ట్

ఇది ఒక స్పై థ్రిల్లర్. ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అలెగ్జాండర్ హేల్ మెదడును ఎవరో హ్యాక్ చేసి అతని ప్రతి ఆలోచనను ట్రాన్స్‌మిట్ చేస్తున్నారని తెలుసుకుంటాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి, నిజాన్ని వెలికితీయడానికి అతడు చేసే పోరాటమే కథ.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 28 2025

హ్యాపీ అండ్ యూ నో ఇట్

పిల్లల మ్యూజిక్ ఇండస్ట్రీపై ఆధారపడిన ఈ డాక్యుమెంటరీలో బేబీ షార్క్ వంటి పాటలు ఎలా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాయో వివరించారు.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 26 2025

నాగిన్ 7

ఏక్తా కపూర్ సూపర్‌నేచురల్ ఫ్రాంచైజీ ఏడవ భాగం ఇది. రూపం మార్చుకునే నాగిన్ ఆరణ్ కథ, నాగా మణి రక్షణ, అనంతకుల్ వంశ రహస్యాలు ఈ సీజన్‌లో ప్రధానంగా ఉంటాయి.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 27 2025

నోబడి 2

హచ్ మాన్సెల్ తిరిగి ప్రమాదకర మిషన్లలోకి దిగే యాక్షన్ థ్రిల్లర్. కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లినా, మాఫియా గ్యాంగ్‌లతో ఎదురుపడాల్సి వస్తుంది.

ఎక్కడ చూడాలి : జియో హాట్ స్టార్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 22 2025

35
నెట్ ఫ్లిక్స్ లో రిలీజయ్యేవి

ఆంధ్ర కింగ్ తాలూకా

సూపర్ స్టార్ అభిమానిగా జీవించే సాగర్ జీవితం చుట్టూ తిరిగే ఈ తెలుగు డ్రామా, హీరో వందో సినిమా సంక్షోభం నుంచి బయటపడే ప్రయాణాన్ని చూపిస్తుంది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 2025

కవర్ అప్

పులిట్జర్ విజేత జర్నలిస్ట్ సీమోర్ హెర్ష్ జీవితంపై రూపొందిన రాజకీయ డాక్యుమెంటరీ ఇది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 2025

గుడ్‌బై జూన్

క్రిస్మస్ నేపథ్యంతో రూపొందిన ఫ్యామిలీ డ్రామా. ఆసుపత్రిలో ఉన్న తల్లి చివరి రోజుల్లో కుటుంబ సభ్యులు ఎదుర్కొనే భావోద్వేగాలు కథగా వస్తాయి.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 24 2025

ఐడల్ ఐ

కొరియన్ లీగల్ మిస్టరీ రొమాన్స్ సిరీస్. క్రిమినల్ లాయర్ మరియు ఆమె అభిమానించే ఐడల్ హత్య కేసులో చిక్కుకోవడంతో కథ మలుపులు తిరుగుతుంది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 22 2025

రివాల్వర్ రీటా

కీర్తి సురేష్ నటించిన తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్. అనుకోని సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 26 2025

స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2

హాకిన్స్ పట్టణంలో వాస్తవికతనే మార్చేసే చివరి అధ్యాయాలు ఈ వాల్యూమ్‌లో చూపిస్తారు.

ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 26 2025

45
జీ 5 లో రిలీజయ్యేవి

ఏక్ దీవానే కి దీవానియత్

ప్రమాదకర ప్రేమ, రాజకీయ శక్తి నేపథ్యంలో సాగే రొమాంటిక్ థ్రిల్లర్.

ఎక్కడ చూడాలి : జీ 5

రిలీజ్ డేట్ : డిసెంబర్ 26 2025

మిడిల్ క్లాస్

చెన్నైలో సాధారణ జీవితం గడిపే కుటుంబం అనుకోని చెక్ కారణంగా ఎదుర్కొనే సంఘటనలు కథ.

ఎక్కడ చూడాలి : జీ 5 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 24 2025

రొంకిని భవన్

కొత్తగా పెళ్లైన దంపతులు చేరిన పాత భవనంలో దాగి ఉన్న భయానక రహస్యాలపై ఆధారిత బెంగాలీ సిరీస్.

ఎక్కడ చూడాలి : జీ 5 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 2025

55
సన్ నెక్స్ట్ లో రిలీజయ్యేవి

ఇతిరి నేరం

ఒకే రాత్రిలో జరిగే భావోద్వేగ సంభాషణలతో సాగిన మలయాళ డ్రామా.

ఎక్కడ చూడాలి : సన్ నెక్స్ట్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 2025

నిధియుం భూతవుం

గ్రామీణ నేపథ్యంలో సాగే హ్యూమర్ మిస్టరీ థ్రిల్లర్.

ఎక్కడ చూడాలి : సన్ నెక్స్ట్ 

రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 2025

Read more Photos on
click me!

Recommended Stories