Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా

Published : Dec 21, 2025, 10:27 PM IST

Bigg Boss Telugu 9: బిగ్‌ బాస్‌ తెలుగు 9వ గ్రాండ్‌ ఫినాలేలో తనని గతంలో అవమానించిన రమ్య మోక్ష ద్వారా క్షమాణపలు చెప్పించారు కళ్యాణ్‌. అందరి ముందు ఆమె పరువు తీశారు. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే అద్యంతం గ్రాండ్‌గా జరుగుతుంది. ఒక పండగ వాతావరణం నెలకొంది. విజయవంతంగా 105 రోజులు పూర్తి చేసుకున్న బిగ్‌ బాస్‌ షో పండగ ముగిసింది. ఫినాలేలో ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలు, సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నాగార్జున టాప్‌ 4 కంటెస్టెంట్లతో థ్యాంక్స్ చెప్పించడం, సారీ చెప్పించడం చేశారు. ఈ క్రమంలో కళ్యాణ్‌.. తనూజకి థ్యాంక్స్ చెప్పారు. ఆమె వల్లనే తన ఆట మారిందని, బ్యాక్‌ బోన్‌గా నిలిచిందని చెప్పాడు కళ్యాణ్‌.

25
భరణికి సారీ చెప్పిన కళ్యాణ్‌

ఇక సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి చెప్తారు అని హోస్ట్ నాగార్జున అడిగారు. దానికి భరణికి సారీ చెబుతానని తెలిపారు కళ్యాణ్‌. ఆయనకు సపోర్ట్ చేయాలని చాలా సార్లు అనుకున్నానని, కానీ ఎప్పుడు సపోర్ట్ చేయాల్సి వచ్చినా పోటీగా తనూజ, ఇమ్మాన్యుయెల్‌ ఉండేవారు. దీంతో వారికే ప్రయారిటీ ఇచ్చాను. దీంతో భరణి సర్‌కి సపోర్ట్ చేయలేకపోయాను, చివర్లో అయినా చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ లోటు మనసులో ఉండిపోయింది. ఆయనకు సారీ చెబుతాను అని తెలిపారు కళ్యాణ్‌. దాన్ని తాను పట్టించుకోనని, నువ్వు బ్రదర్‌లాంటివాడివి అని తెలిపారు భరణి.

35
రమ్య మాటలకు బాధపడ్డ కళ్యాణ్‌

ఈ సందర్భంగా మాజీ కంటెస్టెంట్లలో ఎవరైనా సారీ చెప్పాలి అనుకుంటున్నావా అని అడగ్గా, అందుకు రమ్య మోక్ష పేరు చెప్పాడు కళ్యాణ్‌. ఓ సందర్భంలో కళ్యాణ్‌ క్యారెక్టర్‌ గురించి తప్పుగా మాట్లాడింది రమ్య మోక్ష. అమ్మాయిల పిచ్చోడు అని కామెంట్‌ చేసింది. అదే సమయంలో తనూజని టచ్‌ చేయడాన్ని కూడా ఆమె ప్రశ్నించింది. ఇది అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. పెద్ద రచ్చ అయ్యింది. దీనిపై నాగార్జున కూడా క్లాస్‌ పీకారు. కానీ ఆ సంఘటన మాత్రం తనని బాగా బాధపెట్టిందన్నారు కళ్యాణ్‌.

45
రమ్య చేత క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌

దీనికి రమ్య మోక్ష స్పందించింది. తాను ఈ విషయంలో ఇప్పటికే సారీ చెప్పినట్టు తెలిపింది. అయినా ఇప్పుడు సారీ చెప్పాల్సి వస్తే చెబుతాను అని, తన మాటలు బాధ పెట్టి ఉంటే క్షమించు అని తెలిపింది. అంతేకాదు కప్‌ విన్‌ కావాలని తెలిపింది. మొత్తంగా తన క్యారెక్టర్‌ అస్సాసినేట్‌ చేసిన రమ్య మోక్ష చేత అందరి ముందు, గ్రాండ్‌ ఫినాలేలో సారీ చెప్పించుకున్నారు కళ్యాణ్‌. ఈ సందర్భంగా రమ్య పరువు పోయినంత పని అయ్యింది. ఆ సమయంలో ఆమె మొఖం వాడిపోయినట్టుగా కనిపించింది. 

55
బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ విన్నర్‌ కళ్యాణ్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌ ఫినాలే గ్రాండ్‌గా జరుగుతుంది. ఇప్పటికే 5వ స్థానంలో సంజనా ఎలిమినేట్‌ అయ్యింది. 4వ స్థానంలో ఇమ్మాన్యుయెల్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఇక 15 లక్షల సూట్‌ కేసు ఆఫర్‌ ని తీసుకుని డీమాన్‌ పవన్‌ వెళ్లారు. ఓ రకంగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. ఇక టాప్‌ 2లో కళ్యాణ్‌, తనూజ ఉన్నారు. వీరిలో కళ్యాణ్‌ విన్నర్‌ అని తెలిసింది. బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌లో కామన్‌ మ్యాన్‌ విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి కామన్‌ మ్యాన్‌కి ట్రోఫీని కట్టపెట్టారు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories