ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హోదా అందుకున్నాడు బాలకృష్ణ. మాస్ మేనరిజమ్స్, డైలాగ్స్ కి ఆయన పెట్టింది పేరు. బాలయ్య డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో బాలకృష్ణ అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్ పరిశ్రమకు ఇచ్చారు. ఇప్పటికీ ఈ జనరేషన్ స్టార్స్ తో ఆయన పోటీపడుతున్నారు.