అరియానాని కూడా రాజ్‌ తరుణ్‌ ప్రెగ్నెంట్‌ చేశాడా?.. మరో దుమారం రేపుతున్న లావణ్య కామెంట్స్..

Published : Aug 02, 2024, 11:22 PM ISTUpdated : Aug 02, 2024, 11:26 PM IST

రాజ్‌ తరుణ్‌ లావణ్యల వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది. ఇందులో అరియానా పేరు మరోసారి తెరపైకి రావడం షాకింగ్‌గా ఉంటే ఆమెని కూడా ప్రెగ్నెంట్‌ చేశాడనే ఆరోపణ దుమారం రేపుతుంది.   

PREV
16
అరియానాని కూడా రాజ్‌ తరుణ్‌ ప్రెగ్నెంట్‌ చేశాడా?.. మరో దుమారం రేపుతున్న లావణ్య కామెంట్స్..

రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం పెద్ద రచ్చ అవుతుంది. వీరి వివాదం ఓ వైపు కేసులు, కోర్టుల చుట్టూ తిరుగుతుండగా, మరోవైపు వీరిద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. తప్పు చేయకపోతే దాచుకుని ఎందుకు తిరుగుతున్నాడని లావణ్య ప్రశ్నిస్తుంది. నా రాజ్‌ నాకు కావాలంటోంది. ఆయన హీరోయిన్‌ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడు, ఆమె కోసం తనని దూరం పెడుతున్నాడని ఆరోపిస్తుంది. మరోవైపు లేటెస్ట్ గా తనకు రాజ్‌ తరుణ్‌ అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

26

మరోవైపు తాను కోర్ట్ లోనే తేల్చుకుంటానని చెప్పాడు రాజ్‌ తరుణ్‌. లావణ్యకి సంబంధించిన చాలా రహస్యాలున్నాయని, అవి బయటపెడతా అని, కోర్ట్ లోనే సబ్‌మిట్‌ చేస్తానని తెలిపారు రాజ్‌ తరుణ్‌. ఇలా ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్‌లో నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లావణ్య, రాజ్‌ తరుణ్‌ తరఫున శేఖర్‌బాషా జీ తెలుగు న్యూస్‌ ఛానెల్‌ డిబేట్‌కి వెళ్లారు. 
 

36
Raj Tarun

అందులో వీరిమధ్య హాట్‌ హాట్‌గా డిస్కషన్‌ జరిగింది. లైవ్‌లోనే కొట్టుకున్నారు. బూతులు తిట్టుకోవడంతోపాటు శేఖర్‌ బాషాపై దాడికి యత్నించింది లావణ్య. ఆయన చేసిన వ్యాఖ్యాలకు ఆమె ఆవేశంతో కొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో లావణ్య మరో సంచలనానికి తెరలేపింది. గతంలోనే బిగ్‌ బాస్‌ అరియానాతో రాజ్‌ తరుణ్‌కి ఎఫైర్‌ ఉందనే ఆరోపణలు చేసింది లావణ్య. 
 

46

ఇప్పుడు మరో సంచలన వ్యాఖ్యలు చేసింది. తనని రెండు సార్లు అబార్షన్‌ చేశాడని గతంలో ఆరోపించిన ఆమె చాలా మంది అమ్మాయిలతో రాజ్ తరుణ్‌ కి ఎఫైర్లు ఉన్నాయని వెల్లడించింది. అయితే ఈ డిబేట్‌లో ఆమె మరో ఆరోపణలు చేసినట్టు వెల్లడించాడు టీవీ యాంకర్‌. అరియానాకి కూడా రాజ్‌ తరుణ్‌ ప్రెగ్నెంట్‌ చేశాడని, అబార్షన్‌ అయ్యిందని ఆమె ఆరోపించినట్టుగా యాంకర్‌ శేఖర్‌ బాషాని ప్రశ్నించాడు.

56

దానికి శేఖర్‌ బాషా మాట్లాడుతూ, ఆ విషయాన్ని ఆవిడ(అరియానా) చెప్పాలి. ఈమె చెప్పడం ఏంటి? తనకు ఇలా జరిగిందని అరియానా చెబితే నమ్ముతారు. ఈమె చెబితే ఎలా నమ్ముతారు, ఆమె నోటికివచ్చినట్టు మాట్లాడుతుందని లావణ్య వ్యాఖ్యలను ఖండించాడు శేఖర్‌ బాషా. డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న అమ్మాయిలను బ్లాక్‌ మెయిల్ చేస్తుందని, వారి జీవితాలను ఆడుకుంటుందని లావణ్యపై ఆరోపణలు చేశారు శేఖర్ బాషా. ఇలా ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. కానీ అరియానాపై ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

66

ఇక అరియానా, రాజ్‌ తరుణ్‌ కలిసి `అనుభవించు రాజా` చిత్రంలో నటించారు. ఆ సమయం నుంచి ఈ ఇద్దర మధ్య సన్నిహిత్యం పెరిగిందనేది లావణ్య వాదన. అంతేకాదు చాలా మందితో రాజ్‌ తరుణ్‌కి ఎఫైర్లు ఉన్నాయని ఆమె చెబుతుంది. మరి ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వివాదం మాత్రం ఇండస్ట్రీకి పెద్ద మచ్చలా తయారవుతుంది. సాధారణ జనం సినిమా వాళ్లు అంటే ఇంత నీచంగా ఉంటారా? అని అసహ్యించుకునేలా చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories