ఎన్నికల తర్వాత ఫస్ట్ టైమ్ రోజాపై హైపర్‌ ఆది కామెంట్‌.. పెళ్లి ఎలాగో, ఎమ్మెల్యే పదవి అలానే..

First Published | Aug 3, 2024, 12:17 AM IST

హైపర్‌ ఆది.. గత ఎన్నికల్లో మాజీ మంత్రి రోజాపై విమర్శలు చేశాడు. తాజాగా ఆమెపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆమె వల్లే తనకు ఇంతటి పేరు అంటూ షాకిచ్చాడు ఆది. 

హైపర్‌ ఆది.. అదిరిపోయే పంచ్‌లతో ఆడియెన్స్ అని అలరిస్తుంటాడు, నవ్విస్తుంటాడు. ఆయన ఈ షో చేసినా నవ్వులే నవ్వులు. అదిరిపోయే పంచ్‌లకు హైపర్‌ ఆది కేరాఫ్‌. సినిమా ఫంక్షన్లలోనూ, అలాగే రాజకీయ వేదికల్లోనూ ఆయన తన మార్క్ పవర్‌ఫుల్‌డైలాగులు, ప్రాసలు, యాసలు మేళవించిన పంచ్‌లతో రెచ్చిపోతూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాడు. 

హైపర్‌ ఆది రాజకీయాల్లో పవన్‌ అంటే ఇష్టం. ఆయన కోసం మొన్నటి ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశాడు.  మొత్తంగా ఏపీలో పవన్‌ కళ్యాణ్‌ ఘనవిజయం సాధించాడు. పోటీ చేసి 21 స్థానాల్లో ఆయన అభ్యర్థులు గెలిచారు. అయితే జనసేన కోసం ప్రచారం చేశాడు. అందులో క్రియాశీలకంగా పనిచేసిన నేపథ్యంలో హైపర్‌ ఆదికి పదవులు వస్తాయని భావించారు. ఎమ్మెల్సీ ఇస్తారనేప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఆయన పవన్‌ కోసం పనిచేశాను, పదవుల కోసం పనిచేయలేదని చెప్పాడు ఆది. 
 


ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అలాంటి ప్రశ్న ఎదురైంది. ఎమ్మెల్యే పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది.? అది జరగలేదు ఎందుకు? అనే ప్రశ్నకి.. నా పెళ్లికి సంబంధించిన వార్తలు ఎలాగైతే వస్తుంటాయో, కొందరు తనపై అభిమానంతో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తుంటారో, లేదంటే యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్‌ కోసం వాడుతుంటారో, అలానే ఎమ్మెల్యే పదవి, దర్శిలో పోటీ చేయడం కూడా. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదని, స్వచ్ఛంగా పవన్‌ కళ్యాణ్‌ కోసం ప్రచారం చేశాను అని తెలిపాడు హైపర్‌ ఆది. 
 

ఈ సందర్భంగా రోజాపై అభిప్రాయమేంటి? అనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి ఆది స్పందిస్తూ, రోజాకి ఆయనంటే(జగన్‌) ఇష్టం. నాకు పవన్‌ అంటే ఇష్టం. ఎవరి ఇష్టాలు వారివి. కానీ జబర్దస్త్ జడ్జ్ గా ఆమె అంటే ఎప్పుడూ గౌరవమే. తనలాగే చాలా మంది ఆర్టిస్ట్ లకు ఇంతటి పేరు వచ్చిందంటే కారణం ఆమెనే. ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పాడు ఆది. 
 

పెళ్లెప్పుడు అనే ప్రశ్నకి స్పందిస్తూ, నిజానికి తనకు టీవీ షోస్‌లో ఆల్‌రెడీ చేశారని, యూట్యూబ్‌లో పిచ్చి పిచ్చిగా చేశారని తెలిపారు. రియల్‌ లైఫ్‌లో పెళ్లి అనేది ఇంకా టైమ్‌ ఉంది. కానీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్ననే బాగుంటుంది. కొన్నాళ్లు అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పాడు ఆది. ఈటీవీ చిట్‌ చాట్‌లో ఈ విషయాలను పంచుకున్నాడు ఆది. 
 

Latest Videos

click me!