ఎన్టీఆర్ చేతికి సింపుల్ గా కనిపిస్తున్న కొత్త వాచ్..ఆ ధరతో చిన్న మూవీ తీసేయొచ్చు, ఎన్ని కోట్లో తెలుసా

First Published | Aug 10, 2024, 11:31 AM IST

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. శుక్రవారం రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది.

అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఈ ఆరేళ్లలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన చిత్రం ఆర్ఆర్ఆర్ మాత్రమే. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇకపై తారక్ ఫ్యాన్స్ కి ఆ డిస్సప్పాయింట్మెంట్ అవసరం లేదు. సెప్టెంబర్ లో దేవర రిలీజ్ అవుతోంది. వార్ 2 కూడా రెడీ అవుతోంది. 

ఇంతలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. శుక్రవారం రోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తుండడం విశేషం. 


అయితే ఈ మూవీ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ధరించిన కొత్త వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెలెబ్రిటీలు వాడే కొత్త వస్తువు ఏది కనిపించినా అది చిన్న బ్యాగ్ నుంచి కారు వరకు ఏదైనా కావచ్చు.. వెంటనే నెటిజన్లు అది ఏ బ్రాండ్, దాని ధర ఎంత అని ఆరా తీస్తారు. ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ చూడడానికి సింపుల్ గా ఉంది.  

NTR-Prasanth Neel

కానీ ఆ వాచ్ ధర వింటే మాత్రం మతి  ఖాయం. అది పాటెక్ పిలిప్పీ బ్రాండ్ కి చెందిన వాచ్. దాని ధర అక్షరాలా రెండున్నర కోట్లు. యుఎస్ మార్కెట్ లో దీని ధర 3 లక్షల డాలర్లు. 

ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. తారక్ రెమ్యునరేషన్ 100 కోట్ల వరకు ఉంటుంది. దేవర కనుక హిట్ అయితే ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు రెండున్నర కోట్లు ఎన్టీఆర్ కి పెద్ద విషయం కాదు. కానీ నార్మల్ గా ఆలోచిస్తే ఆ ధరతో చిన్న సినిమా ఒకటి తీసేయొచ్చు. 

Latest Videos

click me!