టాలీవుడ్ లో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్..టాప్ డైరెక్టర్ ఎలా అవమానించాడో తెలుసా ?

First Published | Aug 10, 2024, 10:13 AM IST

టాలీవుడ్ లో హీరోయిన్ల క్రేజ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నార్త్ హీరోయిన్ల ప్రభావం కూడా టాలీవుడ్ లో ఎక్కువైంది. నార్త్ నుంచి వచ్చి సౌత్ ఇండియాని, టాలీవుడ్ ని ఊపేసిన ఒక హీరోయిన్ బిగినింగ్ లోనే అవమానం ఎదుర్కొందట.

టాలీవుడ్ లో హీరోయిన్ల క్రేజ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నార్త్ హీరోయిన్ల ప్రభావం కూడా టాలీవుడ్ లో ఎక్కువైంది. నార్త్ నుంచి వచ్చి సౌత్ ఇండియాని, టాలీవుడ్ ని ఊపేసిన ఒక హీరోయిన్ బిగినింగ్ లోనే అవమానం ఎదుర్కొందట. క్రేజీ డైరెక్టర్ ఆ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

ఆమె ఎవరో కాదు.. గోవా బ్యూటీ ఇలియానా. ఒకప్పుడు ఇలియానా గ్లామర్ కి కుర్రాళ్లంతా ఆమె నామస్మరణ చేశారు. టాలీవుడ్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న మొట్ట మొదటి హీరోయిన్ ఇలియానానే. దేవదాసు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. పోకిరి చిత్రంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. 


క్రేజీ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దేవదాసు చిత్రంలో ఇలియానాని పరిచయం చేశారు. అయితే ఇలియానా తెలుగులో నటించాల్సిన మొదటి చిత్రం దేవదాసు కాదట. వైవిఎస్ చౌదరితో పాటు మరో టాప్ డైరెక్టర్ కూడా ఇలియానాని ఒకేసారి చూశారట. వైవిఎస్ చౌదరి ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే ఆ టాప్ డైరెక్టర్ ఎవరనేది చెప్పలేదు. 

సదరు డైరెక్టర్ ఇలియానాని తన చిత్రాన్ని ఎంపిక చేసుకున్నారట. ఇలియానాకి యాక్టింగ్ సరిగ్గా రాదు కాబట్టి ఆమెకి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చారట. మూడు నెలల తర్వాత కూడా ఇలియానాతో నటన మెరుగైనట్లు ఆ డైరెక్టర్ కి అనిపించలేదు. దీనితో ఆమె నటన నచ్చక రిజెక్ట్ చేశారు. అంతా ఒకే అనుకుని, మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఆమెని రిజెక్ట్ చేశారు. 

Ileana

ఇది ఇలియానాకి ఆరంభంలో ఎదురైన అవమానం. దీనితో వైవిఎస్ చౌదరి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఎందుకంటే ఇప్పుడు ఇలియానాని తన చిత్రంలోకి తీసుకోవచ్చు కాబట్టి. అలా ఇలియానాకి దేవదాసు మొదటి చిత్రం అయింది. ఆ మూవీలో నాకు నచ్చినట్లు ఇలియానాని నేను చూపించా. అది మీ అందరికి నచ్చింది అని వైవిఎస్ చౌదరి అన్నారు. 

ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే.. వైవిఎస్ చౌదరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వీణా రావు అనే కొత్త అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలియానా గురించి వివరించారు. 

Latest Videos

click me!