ఊహకందని రాజమౌళి నిర్ణయం, వారణాసిలో హనుమంతుడి పాత్రలో లవర్ బాయ్.. అసలేం చేస్తున్నావ్ జక్కన్న ?

Published : Nov 19, 2025, 07:47 PM IST

ఒక్క టైటిల్ గ్లింప్స్ తోనే వారణాసి మూవీ గురించి వరల్డ్ వైడ్ గా చర్చ మొదలైంది. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడిని రాజమౌళికి ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

PREV
15
మహేష్ బాబు వారణాసి మూవీ 

దర్శక ధీరుడు రాజమౌళి తన ఇమాజినేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకువెళుతూ వారణాసి చిత్రంతో హాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. మహేష్ బాబు హీరోగా వెయ్యి కోట్లకి పైగా బడ్జెట్ తో వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన వారణాసి టైటిల్ అండ్ టీజర్ పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. మహేష్ బాబు ఈ చిత్రంలో కాలంలో ప్రయాణించే హీరో అని రాజమౌళి టీజర్ తో హింట్ ఇచ్చారు. మొన్నటివరకు గ్లోబ్ ట్రాటర్ అని మాత్రమే చెబుతూ వచ్చారు. టీజర్ తో టైం ట్రాటర్ అని కూడా చెప్పేశారు. 

25
శ్రీరాముడిగా మహేష్ బాబు 

ఈ మూవీలో మహేష్ బాబు త్రేతాయుగంలో శ్రీరాముడిగా కనిపించబోతున్నాడు. రామాయణంలో కీలక ఘట్టాన్ని ఈ చిత్రంలో చిత్రీకరించినట్లు రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబుని రాముడి వేషధారణలో చూసినప్పుడు తనకి గూస్ బంప్స్ కలిగాయని రాజమౌళి అన్నారు. 

35
హనుమంతుడిగా ఎవరు ?

శ్రీరాముడు కుంభకర్ణుడిని అంతమొందించే వార్ సీన్ ఈ చిత్రంలో ఉండే అవకాశం ఉందని టీజర్ రిలీజ్ తర్వాత అంతా అంచనా వేస్తున్నారు. రామాయణం సన్నివేశాలు అంటే హనుమంతుడు పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందే. టీజర్ విజువల్స్ లో కూడా ఉగ్ర రూపం దాల్చిన హనుమంతుడిని చూపించారు. 

45
రాజమౌళి షాకింగ్ డెసిషన్ ?

రాముడిగా మహేష్ బాబు నటిస్తున్నట్లు తేలిపోయింది. హనుమంతుడు ఎవరు అనేది క్లారిటీ లేదు. దీనితో తాజాగా ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు హనుమంతుడు పాత్ర కోసం రాజమౌళి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హనుమంతుడు పాత్రలో ప్రముఖ నటుడు ఆర్ మాధవన్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

55
హనుమంతుడిగా లవర్ బాయ్ 

మాధవన్ పేరు చెప్పగానే ఆయన ప్రేమ కథా చిత్ర చిత్రాలు సఖి, చెలి.. ఈ విధంగా ఆయన లవర్ బాయ్ ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడంటే మాధవన్ వైవిధ్యమైన పాత్రలు చేస్తున్నారు. విలన్ గా కూడా నటిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాధవన్ కి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. మాధవన్ వారణాసిలో హనుమంతుడిగా నటిస్తున్నది నిజం అయితే.. ఆ పాత్రలో రాజమౌళి ఆడియన్స్ ని ఎలా కన్విన్స్ చేయబోతున్నారు, మాధవన్ ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనేది పెద్ద ప్రశ్న. 

Read more Photos on
click me!

Recommended Stories