అశ్లీలంగా చూపిస్తాడు ఆయనతో మూవీ చేయను... రాఘవేంద్రరావు అవమానించిన స్టార్ హీరోయిన్!

Published : Apr 18, 2024, 01:58 PM IST

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వగా సదరు స్టార్ హీరోయిన్ చేయనని ముఖాన చెప్పేసిందట. అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఆమెకు ఆఫర్ చేసిన పాత్రకు మంచి పేరు వచ్చిందట..   

PREV
16
అశ్లీలంగా చూపిస్తాడు ఆయనతో మూవీ చేయను... రాఘవేంద్రరావు అవమానించిన స్టార్ హీరోయిన్!


కే రాఘవేంద్రరావు టాలీవుడ్ దిగ్దర్శకుల్లో ఒకరు. దాదాపు అన్ని రకాల జోనర్స్ ఆయన టచ్ చేశారు. మూడు తరాల హీరోలతో పనిచేసిన రాఘవేంద్రరావు కమర్షియల్ చిత్రాలతో బ్లాక్ బ్లస్టర్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు అనేక రికార్డులు నమోదు చేశారు. 

26
K Raghavendra Rao

కాగా రాఘవేంద్రరావు సినిమాల్లో పాటలు చాలా ప్రత్యేకం. రసికులు విందు భోజనంలా ఉంటాయి. హీరోయిన్స్ నాభి మీద రంగు రంగుల పళ్ళు విసురుతాడు. స్నానాలు చేయిస్తాడు. పక్షులతో గిలిగింతలు పెట్టిస్తాడు. రాఘవేంద్రరావు అనగానే బొడ్డు మీద ఆపిల్ గుర్తుకు వస్తుంది. 

 

36
Taapsee Pannu

రాఘవేంద్రరావు హీరోయిన్స్ గ్లామర్ ని ఇలా ప్రదర్శించడం పై కొందరు విమర్శలు చేశారు కూడా. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్న తాప్సీ డెబ్యూ మూవీ ఝుమ్మంది నాదం. ఈ మూవీలో రాఘవేంద్రరావు తన బొడ్డు మీద కొబ్బరి చిప్పలు  విసిరారు. ఆ సాంగ్ లో గుమ్మడి కాయలు కూడా వాడారు. దేవుడి దయవల్ల అవి వేయలేదు.. అని తాప్సి ఎద్దేవా చేసింది. 

46
Smita patil


కాగా 40 ఏళ్ల క్రితమే రాఘవేంద్రరావు పట్ల హీరోయిన్స్ లో ఒకింత వ్యతిరేక భావన ఉండేదట. త్రిశూలం మూవీలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ నటి స్మిత పాటిల్ ని సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేశారట. 
 

56
trisulam movie

రాఘవేంద్రరావు హీరోయిన్స్ ని అశ్లీలంగా చూపిస్తాడు. ఆయన డైరెక్షన్ లో నేను నటించను అన్నారట. స్మిత చేయను అనడంతో జయసుధను ఆ పాత్ర కోసం ఎంపిక చేశారట. శ్రీదేవి, జయసుధ, రాధిక హీరోయిన్స్ గా నటించిన త్రిశూలం సూపర్ హిట్. 1982లో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణంరాజు హీరో. 

 

66
Trisulam Movie

జయసుధ డీగ్లామర్ రోల్ చేయగా ఆమెకు మంచి పేరు వచ్చింది. జయసుధ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. స్మిత రిజెక్ట్ చేయడంతో జయసుధకు ఆ రోల్ దక్కింది. ఈ చిత్రంలోని 'రాయిని ఆడది చేసిన రాముడివా' సాంగ్ ఇప్పటికీ చాలా ఫేమస్.. 
 

click me!

Recommended Stories