బాలీవుడ్ లో కపూర్ ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, నిర్మాతలు, దర్శకులు, ఇలా కపూర్ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది సినిమా జనాలు ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్నారు. అందులో రణ్ బీర్ కు డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అమ్మాయిల కలల రాకుమారిడిగా ఉన్న ఈ యంగ్ హీరోతో.. చాలామంది హీరోయిన్లు ప్రేమలో పడ్డారు.. డేటింగ్ చేశారు.. కాని చివరగా ఆలియాభట్ రణ్ బీర్ చేత మూడు ముళ్ళు వేయించుకుంది.