ప్రభాస్ కంటే ముందు అనుష్క ఆ ముగ్గురితో ఎఫైర్స్ నడిపిందా? ఆ వార్తల్లో నిజమెంత?

First Published | Jul 5, 2024, 5:19 PM IST

అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. సుదీర్ఘ కెరీర్ లో అనుష్కపై ఒక్క కాంట్రవర్సీ లేదు. ఆమె నిర్మాతల హీరోయిన్ అంటారు. అయితే అనుష్క ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోవడం విశేషం. ప్రభాస్ తో పాటు మరికొందరు హీరోలతో ఆమె ఎఫైర్ నడిపిందంటూ పుకార్లు ఉన్నాయి.

Anushka Shetty


అనుష్క శెట్టి ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ చాలా పద్దతిగా ఉంటారు. కొన్ని చిత్రాల్లో మాత్రమే ఆమె గ్లామరస్ రోల్స్ చేశారు. అనుష్క సోషల్ మీడియా వాడరు. చాలా అరుదుగా స్పందిస్తారు. పరిశ్రమలో ఆమెను అందరూ స్వీటీ అని పిలుస్తారు. ఆమె నేచర్, బిహేవియర్ కూడా చాలా స్వీట్ గా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మిస్ పర్ఫెక్ట్. కానీ అనుష్కపై ఎఫైర్ రూమర్స్ రావడం అనూహ్య పరిణామం. సుదీర్ఘ కెరీర్లో హీరోలు, సాంకేతిక నిపుణులతో ఆమె ఎఫైర్స్ నడిపారనే వాదనలు ఉన్నాయి. 
 

ప్రభాస్, అనుష్కల పెళ్లి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. మా మధ్య ఏమీ లేదు, మంచి మిత్రులం మాత్రమే అని వీరిద్దరూ ఎన్ని సార్లు మొత్తుకున్నా... ఫ్యాన్స్, మీడియా మాత్రం నమ్మడం లేదు.  బాహుబలి సినిమా సమయంలో మొదలైన అనుష్క, ప్రభాస్ పెళ్లి రూమర్ చాలా ఏళ్ళుగా హల్చల్ చేస్తుంది.
 


సాహో మూవీ ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం చక్కర్లు కొట్టాడు ప్రభాస్. ఎక్కడికి వెళ్లినా ఆయనను వెంటాడిన ప్రశ్న.. అనుష్కతో పెళ్లి.  అయితే ప్రభాస్ కంటే ముందే అనుష్క విషయంలో కొన్ని ఎఫైర్ రూమర్స్ వినిపించాయి.

Anushka Shetty

హీరో గోపీచంద్-అనుష్క లవ్ పడ్డారనే ఓ పుకారు ఉంది.  యజ్ఞం మూవీతో హీరోగా నిలదొక్కుకున్న గోపీచంద్ లక్ష్యం రూపంలో భారీ హిట్ కొట్టాడు. ఈ మూవీలో గోపి చంద్ కి జంటగా అనుష్క శెట్టి నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో శౌర్యం మూవీ రాగా, అది కూడా విజయం అందుకుంది.

Anushka Shetty

ఈ సమయంలో అనుష్క, గోపీచంద్ మధ్య ప్రేమ చిగురించినట్లు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారని వరుస కథనాలు వెలువడ్డాయి. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. దీంతో ప్రేక్షకులు సైతం వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అని చెవులు కొరుక్కున్నారు. ఈ పుకార్లపై అనుష్క, గోపిచంద్ నోరు మెదపలేదు. 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకున్నారు.

Nagarjuna Akkineni

అనుష్క డెబ్యూ మూవీ సూపర్. నాగార్జునతో అనుష్క మంచి అనుబంధం కలిగి ఉన్నారు. సూపర్ అనంతరం, డాన్, కేడి చిత్రాల్లో అనుష్క, నాగార్జున జంటగా నటించారు. కింగ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ క్రమంలో నాగార్జున-అనుష్క మధ్య ఎఫైర్ అంటూ వార్తలొచ్చాయి. ఈ పుకార్లను నాగార్జున ఓ సందర్భంలో ఖండించారు.

Anushka Shetty


రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్ , అనుష్క ప్రేమించుకున్నారంటూ ఓ పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్ళను ఒప్పింది అనుష్కను వివాహం చేసుకోవాలని అనుకున్నారట.

Anushka Shetty

సెంథిల్ కుమార్, అనుష్క పెళ్లి కథనాలు అప్పట్లో సంచలనం రేపాయి. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు నిర్ణయం మార్చుకున్నట్లు కొత్త వాదన తెరపైకి వచ్చింది.  2009లో రూహి అనే అమ్మాయిని సెంథిల్ కుమార్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి అనుష్క హాజరుకావడం విశేషం. ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్ లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆయాకాలాల్లో అనుష్క ఈ రూమర్స్ ఫేస్ చేశారు.. 
 

Latest Videos

click me!