మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసుకున్న సాయి పల్లవి ఎంసీఏ, లవ్ స్టోరీ చిత్రాలతో మరింత దగ్గరైంది. సాయి పల్లవి నటించిన బెస్ట్ మూవీస్ లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ఈ చిత్రంలో ఆమె దేవదాసి పాత్ర చేయడం విశేషం. కాగా ఈ సినిమా విషయంలో సాయి పల్లవి చాలా ఇబ్బందులు పడిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.
శ్యామ్ సింగరాయ్ లో తన పార్ట్ మొత్తం నైట్ షూట్ చేశారట. సాయి పల్లవికి గతంలో రాత్రుళ్ళు షూటింగ్ చేసిన అనుభవం లేదట. రాత్రి మొదలుకుని తెల్లారే వరకు షూటింగ్ జరిగేదట. మరలా ఉదయం ఇతర చిత్రాల షూటింగ్స్ లో ఆమె పాల్గొనాల్సి వచ్చేదట. దాంతో నిద్రలేక సాయి పల్లవి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందట. ఈ విషయం తన చెల్లి పూజ ఖన్నాకు చెప్పి బాధపడిందట.