కమల్ హాసన్, ఇళయరాజా కాంబోలో టాప్ 5 లవ్ సాంగ్స్

First Published | Nov 12, 2024, 9:46 AM IST

ఇళయరాజా, కమల్ కాంబినేషన్‌లో వచ్చిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో టాప్ 5 ఎవర్‌గ్రీన్ లవ్ సాంగ్స్ గురించి  చూద్దాం.
 

ఇళయరాజా, కమల్

సినిమాలు ఒకటి, రెండు సార్లు చూసినా, పాటలు మాత్రం చాలాసార్లు వింటాం. సినిమా హిట్ కావడానికి పాటలు కూడా ఒక కారణం. మరీ ముఖ్యంగా ఇలయరాజా పాటలంటే సౌత్ ఇండియాన్ ఆడియన్స్ చెవులు కోసేసుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే  ఇళయరాజా, కమల్ హాసన్  కాంబోలో వచ్చిన లవ్ సాంగ్స్ అద్భుతం అని చెప్పవచ్చు. మరి  టాప్ 5 లవ్ సాంగ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. 

Also Read: సూర్య ఫస్ట్ క్రష్ జ్యోతిక కాదా..? అన్న వన్ సైడ్ లవ్ రివిల్ చేసిన హీరో కార్తి, ఇంతకీ ఎవరా హీరోయిన్...?

దేవర్ మగన్

భారతి రాజా దర్శకత్వంలో, కమల్, శివాజీ గణేషన్ నటించిన “దేవర్ మగన్” 1992లో విడుదలైంది. కమల్, రేవతి జంటగా నటించారు. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది.  కమలే ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలోని 10 పాటలు హిట్ అయ్యాయి. అందులో “సన్నజాని పాడగా.. ” పాటకు ఇప్పటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. 

Also Read: పుష్ప 2 సాంగ్ కోసం శ్రీలీల అంత డిమాండ్ చేసిందా..? అల్లు అర్జున్ తో ఐటం సాంగ్ కి ఎంత రెమ్యునరేషన్ ..?


సత్య

సురేష్ కృష్ణ దర్శకత్వంలో 1988లో వచ్చిన సినిమా “సత్య”. కమల్, అమల జంటగా నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని “వలయోసై” పాట చాలా ఫేమస్. బాలసుబ్రహ్మణ్యం పాడిన  ఈ పాట రిఫరెన్స్‌ని “కాధువాకుల రెండు కాధల్” సినిమాలో విఘ్నేష్ శివన్ వాడారు.

Also Read: బాలయ్య ముందు నోరు జారిన అల్లు అర్జున్, పుష్ప 2 రిలీజ్ టైమ్ లో రిస్క్ చేయొదంటున్న అభిమానులు

కమల్ ఎవర్‌గ్రీన్ సాంగ్స్

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, కమల్ హీరోగా నటించిన సినిమా “మైఖేల్ మదన కామరాజన్”. కమల్ 4 పాత్రల్లో నటించారు. ఖుష్బూ, ఊర్వశి, రూబిణి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని “సుందరి నీవు పాట ఎంత అద్భుంగా ఉంటుందో అందరికి తెలిసిందే..

గుణ

కమల్ హీరోగా నటించిన “గుణ” సినిమా పెద్దగా ఆడలేదు. కానీ 2K కిడ్స్‌కి ఈ సినిమా చాలా ఇష్టం. సంతాన భారతి దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. కమలే ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలోని కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే పాట ఇప్పటి యూత్ ప్రేమికులు కూడా పాడుకుంటుంటారు. 

మూండ్రాం పిరై

బాలు మహేంద్ర దర్శకత్వంలో, కమల్, శ్రీదేవి నటించిన “మూండ్రాం పిరై” ఎవర్‌గ్రీన్ సినిమా. ఈ సినిమాకు కమల్‌కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాలోని “కన్నె కలైమానే” పాట చాలా బాగుంటుంది. ఈ పాటలు అన్నీ కమల్, ఇళయరాజా కాంబోలో వచ్చిన స్పెషల్ లవ్ సాంగ్స్.

Latest Videos

click me!