కోమాలో కట్టప్ప సత్యరాజ్ భార్య, 4 ఏళ్లుగా నరకంచూస్తున్న మహేశ్వరి.

First Published | Nov 12, 2024, 10:18 AM IST

నటుడు సత్యరాజ్ భార్య మహేశ్వరి గత నాలుగు సంవత్సరాలుగా కోమాలో ఉన్నారని ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ వెల్లడించారు.

సత్యరాజ్ భార్య

1980లలో తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా వెలుగొందిన సత్యరాజ్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి సమకాలీన నటులతో పోటీ పడ్డారు. కాలానుగుణంగా పాత్రలను ఎంచుకుంటూ నటిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలిలో కట్టప్ప పాత్ర తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం కూలీ.

Also Read: కమల్ హాసన్, ఇళయరాజా కాంబోలో టాప్ 5 లవ్ సాంగ్స్

సత్యరాజ్ కుటుంబం

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి నటిస్తున్నారు సత్యరాజ్. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. సిబిరాజ్, దివ్య అనే ఇద్దరు పిల్లలు సత్యరాజ్ కి ఉన్నారు. సిబిరాజ్ కూడా నటుడిగా రాణిస్తున్నారు.

Also Read: సూర్య ఫస్ట్ క్రష్ జ్యోతిక కాదా..? అన్న వన్ సైడ్ లవ్ రివిల్ చేసిన హీరో కార్తి, ఇంతకీ ఎవరా హీరోయిన్...?


సత్యరాజ్ కూతురు

సత్యరాజ్ కుమార్తె దివ్య సినిమాల్లోకి రాలేదు కానీ, పోషకాహార నిపుణురాలిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె రాజకీయాల్లోకి రాబోతున్నారని, బిజెపిలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన దివ్య, బిజెపి ఆహ్వానాన్ని తిరస్కరించానని, తన రాజకీయ అడుగుల గురించి త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.

Also Read: టేస్టీ తేజ కు దమ్ములేదా..? విరుచుకుపడిన కన్నడ బ్యాచ్.. నామినేషన్స్ లో ఉన్నది వీళ్లే..?

సత్యరాజ్

సిబిరాజ్, దివ్య గురించి చాలామందికి తెలుసు కానీ, సత్యరాజ్ భార్య మహేశ్వరి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ నేపథ్యంలో తన తల్లి గురించి దివ్య ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సత్యరాజ్ భార్య మహేశ్వరి గత నాలుగేళ్లుగా కోమాలో ఉన్నారట. ఆమెకు PEG ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని, ఆమె ఎప్పుడు కోలుకుంటుందా అని  ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Also Read: పుష్ప 2 సాంగ్ కోసం శ్రీలీల అంత డిమాండ్ చేసిందా..? అల్లు అర్జున్ తో ఐటం సాంగ్ కి ఎంత రెమ్యునరేషన్ ..?

దివ్య సత్యరాజ్

అమ్మను తిరిగి నార్మల్  పరిస్థితికి తీసుకురావాలని ఆశిస్తున్నాం. గత నాలుగేళ్లుగా నాన్న ఒంటరిగా ఉన్నారు. నాన్నమ్మ కూడా కొన్నేళ్ల క్రితం చనిపోయారు. నేను నాన్నకు  తల్లిలా ఉన్నాను. మేమిద్దరం కలిసి ఒక పవర్ ఫుల్ సింగిల్ పేరెంట్ క్లబ్ ని ఏర్పాటు చేసుకున్నాం. బ్రెయిన్ హెమరేజ్ కారణంగానే తన తల్లి మహేశ్వరి కోమాలోకి వెళ్లారని దివ్య సత్యరాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. సత్యరాజ్ వెనుక ఇంత విషాదం ఉందా అని అంతా కామెంట్ చేస్తున్నారు. 

Latest Videos

click me!