మెగాస్టార్ చిరంజీవి, బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ఇంద్ర చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. చిరంజీవి డ్యాన్సులు, ఫైట్స్, మణిశర్మ సంగీతం ప్రేక్షకులని ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. చిరంజీవి కెరీర్ లో మాస్ చిత్రాల్లో ఇంద్ర చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో బాలయ్య, చిరంజీవి మధ్య సినిమాల విషయంలో పోటీ తీవ్రంగా ఉండేది.