జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్‌ను పలువురు సినీ ప్రముఖులు పలకరించారు. నటులు ఆర్. నారాయణమూర్తి, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, సుధీర్‌బాబు, కన్నడ నటుడు ఉపేంద్ర, దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బి.గోపాల్, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, యెర్నేని నవీన్, రవి, దిల్‌రాజు, బీవీఎన్‌ఎస్ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ తదితరులు అల్లు అర్జున్‌ను పరామర్శించారు.
బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్‌తోపాటు ఇతర భాషలకి చెందిన పలువురు సినీ తారలు అర్జున్‌కి ఫోన్ చేశారు. అర్జున్ జైలు నుంచి విడుదల కావడంపై హీరో మంచు మనోజ్ ‘మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్’ అంటూ ఎక్స్ ద్వారా స్పందించారు.