ఆమె వల్ల క్యారెక్టర్ పై నిందలు, అయినా నిలబడ్డాడు.. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొత్తం ఎంత సంపాదించాడంటే

First Published | Dec 16, 2024, 7:11 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా రూ 55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అయింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్ చరిత్ర సృష్టించాడు. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీ అతడికి దక్కింది. ఏకంగా రూ 55 లక్షల ప్రైజ్ మనీ నిఖిల్ సొంతం అయింది. తెలుగు నటుడు కాకపోవడంతో కన్నడ బ్యాచ్ అంటూ నిఖిల్ పైకి అవమానాలు మొదలయ్యాయి. యష్మి విషయంలో నిఖిల్ చివరికి తన క్యారెక్టర్ పై కూడా మచ్చ వేయించుకున్నాడు. 

ఆడవాళ్ళని వాడుకునే రకం అంటూ ఇతర హౌస్ మేట్స్ నిఖిల్ క్యారెక్టర్ ని తప్పు పట్టారు. అయినప్పటికీ నిఖిల్ సహనం కోల్పోలేదు. కోపం వచ్చినప్పటికీ నోరు జారే విధంగా ప్రవర్తించలేదు. అన్నింటికీ తట్టుకుని దమ్మున్నోడిగా నిలబడ్డాడు. బిహేవియర్ లో జెంటిల్ మాన్ అనిపించుకున్నాడు.చివరికి నిఖిల్ బిగ్ బాస్ తెలుగు 8 విజేతగా నిలిచాడు. 

Tap to resize

బిగ్ బాస్ చరిత్రలోనే నిఖిల్ అత్యథిక ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ విన్నర్ కి 50 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నారు. కానీ ఈ సీజన్ కి ప్రైజ్ మనీ 55 లక్షలకి చేరింది. ప్రైజ్ మనీ పక్కన పెడితే నిఖిల్ రెమ్యునరేషన్ కూడా తక్కువేం కాదు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో వారానికి 2.25 లక్షలు రెమ్యునేషన్ తీసుకున్నాడు. మొత్తం 15 వారాలకు నిఖిల్ లో పారితోషికం రూపంలో 33 లక్షల వరకు ముట్టింది. 

ప్రైజ్ మనీ 55 లక్షలు, రెమ్యునరేషన్ 33 లక్షలు కలిపి మొత్తం 88 లక్షల వరకు నిఖిల్ బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా సంపాదించాడు. దీనితో పాటు మారుతీ సుజుకి డిజైర్ కారు కూడా నిఖిల్ కి దక్కుతుంది. మొత్తంగా చూసుకుంటే నిఖిల్ సంపాదన దాదాపు కోటి రూపాయలు అనుకోవచ్చు. పడ్డ అవమానాలకు, దమ్మున్నోడిగా నిలబడి గేమ్ ఆడిన విధానానికి నిఖిల్ కి పారితోషకం, ప్రైజ్ మనీ రూపంలో ప్రతిఫలం దక్కింది. 

తనకి సుపోర్ట్ చేసిన వారి నుంచి, చేయని వారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను అని నిఖిల్ తెలిపారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ చేతుల మీదుగా నిఖిల్ బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే అంతగా హడావిడి లేకుండానే ముగిసింది.  

Latest Videos

click me!