భైరవనే కల్కి, నాగ్ అశ్విన్ ఇచ్చిన హింట్ ఇదే ?..మిస్ లీడ్ చేస్తున్నారా లేక నిజంగానే ట్విస్టా

First Published Jun 22, 2024, 11:31 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలతో ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతం. కానీ దానిని ఎలా చిత్రీకరించారు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలతో ఉన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతం. కానీ దానిని ఎలా చిత్రీకరించారు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇండియన్ సినిమాలోనే హైయెస్ట్ బడ్జెట్ లో నాగ్ అశ్విన్ చేసిన రిస్క్ ఇది. 

ఆల్రెడీ రెండు ట్రైలర్స్ వచ్చాయి. బాగానే ఉందని అంటున్నారు కానీ థంపింగ్ రెస్పాన్స్ రావడం లేదు. బిసి సెంటర్స్ లో ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలు ఉన్నాయి. కానీ హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ కోరుకునే ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు కల్కి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

మంచి కోసం మహా భారతంలో కురుక్షేత్రం తరహాలో కలియుగంలో యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఈ కథ సిద్ధం చేశారట. ట్రైలర్ లో చూపిన దానిప్రకారం భూమి మీద ఉన్న అన్ని వనరులు అయిపోతాయి. పాపాలు పెరిగిపోతాయి. ఆ తరుణంలో మహావిష్ణువు చెప్పిన దానిప్రకారం ఆయన కల్కిగా అవతరించాలి. 

సుమతిగా నటిస్తున్న దీపికా పదుకొనె కడుపున కల్కి జన్మించబోతున్నట్లు ట్రైలర్ చూపారు. మరి కల్కి ప్రభాస్ కాకుంటే.. హీరోగా అతడికి ఉన్న వాల్యూ, కథలో అతడి పాత్ర ఏంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొదట ప్రభాస్ ఈ చిత్రంలో డబ్బుకోసం ఏమైనా చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతడి పాత్ర పేరు భైరవ. 

Kalki 2898 AD

కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం అతడే కల్కి అయితే బావుంటుంది అని అంటున్నారు. సెకండ్ ట్రైలర్ లో భైరవనే కల్కి అన్నట్లుగా నాగ్ అశ్విన్ ఓ హింట్ ఇచ్చాడు. సుమతిని పట్టుకునేందుకు భైరవ.. కాపాడేందుకు అశ్వథామ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య భారీ ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ లో ప్రభాస్.. అశ్వథామని ఒక్క గుద్దు గుద్దితే అంతదూరంలో పోయి పడతారు అశ్వథామ. 

ఆ దెబ్బ రుచికి అశ్వథామకి కురుక్షేత్ర యుద్ధం గుర్తుకు వస్తుంది. భైరవ గుద్దినంత బలంగా కురుక్షేత్రంలో కూడా అశ్వథామని ఎవరో కొట్టినట్లు చూపించారు. ఆ దెబ్బకి అశ్వథామ దూరంగా పోయి పడతాడు. ఆ ఫోర్స్ కి ఏనుగు కూడా కదిలిపోతుంది. అదే దెబ్బ భైరవ అశ్వథామని కొడతాడతాడు. 

అంటే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వథామని కొట్టిన వ్యక్తే మళ్ళీ భైరవ కొట్టాడా ? కురుక్షేత్రంలో అశ్వథామని కొట్టింది ఎవరు ? కృష్ణుడా .. అర్జునుడా .. భీముడా ?మహాభారతంలో అశ్వథామతో ఎవరు యుద్ధం చేసారు అనే అంశాలు లోతుగా తెలిస్తే కాస్త క్లారిటీ వస్తుంది. అంటే భైరవ సాధారణ మానవుడు అయితే కాదు అని ట్రైలర్ ని బట్టి అంచనా వేస్తున్నారు. కృష్ణుడే.. భైరవఅయితే అతడే కల్కి కూడా కావాలి.. అలాంటప్పుడు సుమతి గర్భంలో ఉన్నది ఎవరు ఈ ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. 

మొత్తంగా భైరవ సాధారణ మానవుడు కాదు.. మహాభారతంలో వీరుల్లో ఒకడు అనే ట్విస్ట్ ఏమైనా ఉందా లేక ఆడియన్స్ ని మిస్ లీడ్ చేయడం కోసం ట్రైలర్ లో అలా చూపించారా అనేది తేలాల్సి ఉంది. 

Latest Videos

click me!