వరుస పరాజయాల్లో ఉన్న ఎన్టీఆర్ మూవీ ఆగిపోయింది. దీంతో దర్శకుడు మారారు. కొత్త కథతో సినిమాని రూపొందించారు. ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ని కొట్టారు. ఆ దర్శకుడు ఎవరు? ఆ సినిమా ఏంటనేది చూస్తే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఆయన లెక్కలు మారిపోయాయి. `దేవర`తో పాన్ ఇండియా హిట్‌ని అందుకున్నారు. కానీ `వార్ 2` తో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ మూవీతో అంతా తలక్రిందులయ్యాయి. ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.
24
ఎన్టీఆర్‌ని చూసి షాక్ అయిన రాజమౌళి
ఈ మూవీ తర్వాతనే కొత్త సినిమా అప్ డేట్స్ రాబోతున్నాయి. అయితే త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది ఆగిపోయిందా? ఉందా అనేది క్లారిటీ లేదు. అలాగే `దేవర 2` చేయాల్సి ఉంది. ఎప్పుడు ఏ సినిమా చేస్తారో చూడాలి. ఇదిలా ఉంటే కెరీర్ బిగినింగ్ లో ఎన్టీఆర్ విషయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకున్నాయి. `స్టూడెంట్ నెం 1` టైమ్‌లో దర్శకుడు రాజమౌళి.. తారక్‌ని చూసి వీడేంటి ఇలా ఉన్నాడని అనుకున్నాడట. ఎన్టీఆర్ లావుగా ఉండటంతో వీడు హీరోనా అని మనసులో అనుకున్నాడట. ఆ తర్వాత రియలైజ్ అయ్యాడు, ఇద్దరు కలిసి నాలుగు సినిమాలు చేశారు.
34
40 రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయిన ఎన్టీఆర్ మూవీ
ఇదిలా ఉంటే `స్టూడెంట్ నెం 1` తర్వాత తారక్‌కి హిట్ లేవు. వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో ఎలాగైనా మంచి సినిమా చేయాలని పవన్ శ్రీధర్ దర్శకత్వంలో దొరస్వామి రాజు ఓ సినిమాని నిర్మించారు. దాదాపు 40 రోజులు చిత్రీకరణ జరిపారు. ఔట్‌పుట్ చూసుకున్నాక సరిగా రాలేదట. ఇది ఎన్టీఆర్ ఇమేజ్‌కి సెట్ అయ్యేలా లేదని చెప్పి ఆ సినిమాని పక్కన పెట్టారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళిని తీసుకొచ్చారు. ఆయన మరో కథని రెడీ చేశారు. అలా సేమ్ బ్యానర్‌లోనే ఎన్టీఆర్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేశారు. ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అదే `సింహాద్రి`.
ఎన్టీఆర్ హీరోగా, భూమిక, అంకిత హీరోహీరోయిన్లుగా నటించారు. దొరస్వామి రాజు, విజయ్ కుమార్ వర్మ నిర్మించారు. ఈ సినిమా ఓపెనింగ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. 2003 జులై 11న విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. రూ.8 కోట్లతో రూపొంది, రూ.33కోట్లు వసూలు చేసింది. వంద రోజులకుపైగా ఆడింది. అప్పట్లో ఇది ఇండస్ట్రీ హిట్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాతోనే కమర్షియల్ హీరోగా ఎదిగారు తారక్. స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక రకంగా `సింహాద్రి` మూవీ ఎన్టీఆర్ కెరీర్ కి బిగ్ టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు.